థండాయి |
పాలు - కప్పు చక్కెర - ఒకటిన్నర కప్పు గులాబీ రేకలు - పావుకప్పు నీళ్లు - రెండున్నర కప్పులు బాదంపలుకులు - టేబుల్‌స్పూన్లు తర్బూజా గింజలు - టేబుల్‌స్పూను మిరియాలు - చెంచా గసగసాలు వాము - అర టేబుల్‌స్పూను చొప్పున యాలకులపొడి - అరచెంచా. గులాబీనీరు - అరచెంచా.
ఓ గిన్నెలో అరకప్పు నీళ్లు తీసుకుని అందులో చక్కెర వేసి పెట్టుకోవాలి. అలాగే మిగిలిన నీటిని మరో గిన్నెలోకి తీసుకుని సగం గులాబీరేకలూ, బాదంపలుకులూ, తర్బూజా గింజలూ, మిరియాలూ, గసగసాలూ, వాము వేసుకుని కనీసం గంటా గంటన్నరసేపు నాననివ్వాలి.
తరవాత నానబెట్టన వాటిని మాత్రమే మిక్సీ జారులోకి తీసుకుని మెత్తని ముద్దలా చేసుకోవాలి. ఓ గిన్నెపై మెత్తని, పల్చని బట్ట పెట్టి అందులో ఈ మిశ్రమాన్ని వేయాలి. దీనిపై నీటిని కొద్దికొద్దిగా పోసుకుంటూ వడకట్టుకోవాలి.
ఇందులో పాలూ, చక్కెరా, గులాబీనీరూ, మిగిలిన గులాబీరేకలూ, యాలకులపొడి వేసుకుని అన్నింటినీ బాగా కలపాలి. దీన్ని ఒకటి రెండు గంటలు ఫ్రిజ్‌లో ఉంచి ఆ తరవాత తాగాలి.
No comments:
Post a Comment