చాక్లెట్, కోకోనట్ ఐస్ |
చాక్లెట్ పొడి - ముప్పావుకప్పు చక్కెర - పది టేబుల్‌స్పూన్లు బ్రౌన్ షుగర్ - పావుకప్పు కన్నా కొద్దిగా తక్కువగా ఉప్పు- చిటికెడు చిక్కని కొబ్బరి పాలు - ఒకటిన్నర కప్పు వెనిల్లా ఎసెన్స్ - అర టేబుల్‌స్పూను.
జల్లించిన చాక్లెట్ పొడీ, చక్కెరా, బ్రౌన్ షుగర్, ఉప్పును మిక్సీలో తీసుకుని మెత్తని పిండిలా చేసుకోవాలి.
తరవాత కొబ్బరిపాలూ, వెనిల్లా ఎసెన్స్ వేసుకుని ఉండలు కట్టకుండా నెమ్మదిగా మిక్సీ తిప్పాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని డీప్ ఫ్రీజర్‌లో రెండు నుంచి నాలుగు గంటలు ఉంచాలి.
దీన్ని మళ్లీ బయటకు తీసి మరోసారి మెత్తని ముద్దలా గిలకొట్టుకోవాలి. తరవాత మళ్లీ ఫ్రీజర్‌లో ఉంచితే.. రెండు మూడు గంటలకు గట్టిపడుతుంది. అప్పుడు తీసుకుని తినాలి.
No comments:
Post a Comment