VTStyles

Recent Post

Showing posts with label Bake_IceCream. Show all posts
Showing posts with label Bake_IceCream. Show all posts

Friday, 1 July 2016

Bakery - Ice Cream - Chocolate Icecream / చాక్లెట్‌ ఐస్‌క్రీం

చాక్లెట్‌ ఐస్‌క్రీం


చిక్కనిపాలు - అరలీటరు మొక్కజొన్నపిండి - ఒకటిన్నర టేబుల్‌స్పూను జీఎంఎస్‌ (గ్లిజరిల్‌ మోనో స్టెరేట్‌) - ఒకటిన్నర టేబుల్‌స్పూను సీఎంసీ (సోడియం కార్బాక్సీ మిథైల్‌ సెల్యూలోజ్‌) - చిటికెడు చక్కెర - ఎనిమిది టేబుల్‌స్పూన్లు పాలపొడి - రెండు టేబుల్‌స్పూన్లు తాజా క్రీం - అరకప్పు చాక్లెట్‌ ఎసెన్స్‌ - చెంచా కోకోపొడి - టేబుల్‌స్పూను డ్రింకింగ్‌ చాక్లెట్‌ - రెండు టేబుల్‌స్పూన్లు. (ఇవన్నీ బజార్లో దొరుకుతాయి).

  • ముందుగా ఓ గిన్నెలో పాలను తీసుకుని బాగా మరిగించి అందులోంచి కప్పు పాలు విడిగా తీసి చల్లారనివ్వాలి. ఇప్పుడు మిగిలిన పాలల్లో చక్కెర వేసేయాలి.

  • అది కరిగేలోగా విడిగా తీసిపెట్టుకున్న పాలల్లో మొక్కజొన్నపిండి, జీఎంఎస్‌, సీఎంసీ, పాలపొడి వేసి మెత్తగా కలిపి మరుగుతోన్న పాలల్లో వేయాలి.

  • మంట తగ్గించి మధ్యమధ్య కలుపుతూ ఉంటే కాసేపటికి చిక్కబడుతుంది. అప్పుడు పొయ్యికట్టేసి చల్లారనిచ్చి డీప్‌ఫ్రీజర్‌లో ఉంచేయాలి.

  • ఎనిమిది గంటల తరవాత ఐస్‌క్రీంను బయటకు తీసి అందులో తాజా క్రీం, చాక్లెట్‌ ఎసెన్స్‌, కోకోపొడి, డ్రింకింగ్‌ చాక్లెట్‌ వేసి బీటర్‌తో బాగా గిలకొట్టాలి.

  • పదిహేను నిమిషాలయ్యాక దీన్ని ఫ్రిజ్‌లో ఉంచేయాలి. ఎనిమిది గంటల తరవాత బయటకు తీస్తే కమ్మని చాక్లెట్‌ ఐస్‌క్రీం తయార్‌. ఇది మరింత రుచిగా ఉండాలనుకుంటే కొన్ని చాక్లెట్‌ చిప్స్‌ కూడా వేసుకోవచ్చు.

Bakery - IceCream - Hydrating Fruit Popsicles / హైడ్రేటింగ్ ఫ్రూట్ పాపికల్

హైడ్రేటింగ్ ఫ్రూట్ పాపికల్


పండ్ల (మీకిష్టమైన పండఏవైనా)-ముక్కలు (1 కప్పు )

  • పైనచెప్పిన ఏదైనా ఒక పండు జ్యూస్ను పాపికల్ మోల్డ్ (మన డీప్ ఫ్రిజ్లో ఉండే ట్రేలాంటిది)లో పోయాలి. అందులో ఒక ఐస్ ఫ్రూట్ వుల్లను పెట్టి డీప్ ఫ్రిజ్లో ఓ 5-6 గంటలు పెటాలి.

  • తర్వాత - జ్యూస్ కాస్త్ర ఫొటోల్లో కనిపిస్తున్నట్టుగా మారుతుంది

  • అలా జూస్తోనే కాకుండా వండముక్కలతోనూ ఐస్ ఫ్రూట్ను తయారు చేనుకోవచ్చు ఎలా అంటే. జస్ట్రేలో కొబ్బరినీళపోసి, అందులో మీకు నచ్చిన పండ్ల ముక్కలను చేయాలి.

  • దాంట్లో ఐస్ ఫ్రూట్ వుల్లను పెట్టిపైన చెప్పిన విధంగా చేస్తే చాలు. నోరూరించే ఫ్రూట్ పాపికల్ రెడీ. (కావాలంటే కొబ్బరినీళ్లకు బదులుగా పాలను కూడా వాడొచ్చు)

Bakery - Ice Cream - Mango Icecream / మ్యాంగో ఐస్‌క్రీమ్‌

మ్యాంగో ఐస్‌క్రీమ్‌


క్రీమ్‌: 3 కప్పులు మామిడిపండ్లు(పెద్దవి): రెండు వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌: టీస్పూను పంచదార: 3కప్పులు

  • మామిడిపండ్లను తొక్కు తీసి ముక్కలుగా కోయాలి. వాటిల్లో పంచదార వేసి, మిక్సీలో వేసి మృదువైన గుజ్జులా చేయాలి.

  • క్రీమ్‌ను బాగా గిలకొట్టినట్లుగా కలపాలి. అందులోనే మామిడిపండు మిశ్రమం కూడా వేసి బాగా కలపాలి. అవసరమైతే మరికొంత పంచదార వేయాలి.

  • తరవాత వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ వేసి బాగా కలపాలి. మిశ్రమాన్ని ఓ కంటెయినర్‌లో వేసి ఫ్రీజ్‌ చేయాలి. సగం వరకూ గడ్డకట్టాక బయటకు తీసి ఓ నిమిషం గిలకొట్టాలి.

  • దీన్ని మళ్లీ కంటెయినర్‌లో వేసి ఫ్రీజ్‌ చేయాలి. ఇలా మూడుసార్లు చేస్తే మృదువుగా ఉంటుంది. ఇప్పుడు మ్యాంగో ఐస్‌క్రీమ్‌ రెడీ.

Wednesday, 25 May 2016

IceCreams - Mango Coconut Panacotta/ Maamidi pandu Pancacotta

మ్యాంగో కోకోనట్‌ పన్నాకొట్టా


మామిడి గుజ్జు- 1 కప్పు పంచదార- 1/2 కప్పు ఫ్రెష్‌ క్రీం- అర కప్పు నీళ్ళు- 6 టేబుల్‌ స్పూన్లు అగార్‌ అగార్‌(చైనా గ్రాస్‌)పొడి- 4 టీ స్పూన్లు కొబ్బరి పాలు- 1/2 కప్పు.

  • ముందుగా వేరు వేరు గిన్నెల్లో మూడు టేబుల్‌ స్పూన్ల చొప్పును నీళ్ళను తీసుకుని ఒక్కోదానిలో రెండు టీ స్పూన్ల చైనా గ్రాస్‌పొడి వేసి ఐదునిమిషాలు నానబెట్టాలి.

  • తరువాత కొబ్బరి పాలను సన్నని మంట మీద వేడిచేశాక దానిలో పావు కప్పు పంచదార వేసి కరిగే వరకూ కలపాలి. తరువాత పావు కప్పు ఫ్రెష్‌ క్రీం కూడా వేసి బాగా కలపాలి.

  • ఆ తరువాత ఒక గిన్నెలోని చైనాగ్రాస్‌ మిశ్రమాన్ని పోసి ఉండలు కట్టకుండా బాగా కలిపి మిశ్రమం చిక్కబడ్డాక దించేయాలి. ఈ మిశ్రమం కొద్దిగా చల్లారగానే చిన్న గిన్నెల్లో గానీ, మౌల్డ్‌లలో గాని సగం వరకూ పోయాలి.

  • .ఆ తరువాత మరో పాత్ర తీసుకుని దానిలో పావు కప్పు ఫ్రెష్‌ క్రీం, పావుకప్పు పంచదార, మామిడి గుజ్జు వేసి ఐదునిమిషాలు ఉడికించాలి.

  • తరువాత మరో గిన్నెలో ఉన్న చైనాగ్రాస్‌ మిశ్రమాన్ని కూడా తీసుకుని దీనిలో వేయాలి. మిశ్రమాన్ని ఉండలు కట్టకుండా చిక్కగా అయ్యే వరకూ ఉడికించి చల్లారాక కొబ్బరి మిశ్రమం సగం వరకూ నింపిన మౌల్డ్‌లలో మిగతా సగాన్ని మామిడి మిశ్రమంతో నింపి కనీసం రెండుగంటలు డీప్‌ ప్రీజర్‌లో ఉంచాలి.

IceCreams - Pine Apple Icecream/ Anasa Pandu Icecream

పైనాపిల్‌ ఐస్‌క్రీమ్


పైనాపిల్‌ ముక్కలు - 2 కప్పులు అరటి పండు - 1 కొబ్బరి పాలు - అర కప్పు .

  • పైనాపిల్‌, అరటి ముక్కల్ని గట్టిపడేవరకూ డీప్‌ ఫ్రిజ్‌లో ఉంచాలి.

  • కొబ్బరి పాలను మూత బిగుతుగా ఉన్న గిన్నెలో పోసి తలకిందులుగా డీప్‌ ఫ్రీజర్‌లో ఉంచాలి. ఇలా చేస్తే కొబ్బరిపాలు, క్రీమ్‌ వేరవుతాయి.

  • తర్వాత మిక్సీలో కొబ్బరిపాలు, పైనాపిల్‌, అరటి ముక్కలు వేసి క్రీమ్‌లా చేయాలి.

  • బౌల్స్‌లో నింపి కొబ్బరి క్రీమ్‌ వేసి తినేయాలి.

IceCreams - Mango Jellsious IceFruit/Maamidi Pandu Ice Cream

మాంగో జెల్లీ షియస్‌ ఐస్‌ఫ్రూట్‌


మామిడి గుజ్జు- ఒకటిన్నర కప్పు నీళ్ళు- అరలీటరు పంచదార- 1 కప్పు అగార్‌ అగార్‌ (చైనా గ్రాస్‌)- 10 గ్రాములు.

  • అగార్‌ అగార్‌ను నీళ్ళలో వేసి పావుగంట నానబెట్టాలి. తరువాత నీళ్ళలో పూర్తిగా కరిగే వరకూ సన్నని మంటమీద ఉడికించాలి.

  • తరువాత పంచదార వేసి అది కరిగిన తర్వాత మామిడి గుజ్జు వేసి బాగా కలిపి మంట కట్టేయాలి.

  • ఈ మిశ్రమాన్ని వెంటనే ఐస్‌ఫ్రూట్‌ మౌల్డ్‌లలో పోసి రెండుగంటలు డీప్‌ ఫ్రిజ్‌లో పెట్టాలి.

  • తరువాత మౌల్డ్‌లను బయటకు తీసి ఒకసారి పంపుకింద ఉంచి తీశాకే ఐస్‌ఫ్రూట్‌ను మౌల్డ్‌ నుంచి బయటకు తియ్యాలి.

Wednesday, 20 April 2016

Bake - Icecream - Watermelon Icecream

పుచ్చకాయ ఐస్‌క్రీమ్


నీళ్లు - పావు కప్పు చక్కెర - పావు కప్పు పుచ్చకాయ గుజ్జు - 4 కప్పులు వెనిల్లా ఫ్లేవర్‌ పెరుగు - 1 కప్పు నిమ్మరసం - 1 టే.స్పూను .

  • నీళ్లలో చక్కెర కలిపి వేడిచేసి కరిగాక చల్లార్చాలి.

  • వెడల్పాటి గిన్నెలో పుచ్చకాయ గుజ్జు వేసి పెరుగు, చక్కెర నీళ్లు, నిమ్మరసం వేసి స్పూన్‌తో బాగా గిలక్కొట్టాలి.

  • తర్వాత ఈ మిశ్రమాన్ని వడగట్టి గిన్నెలో వేసి 6 గంటలపాటు గట్టిపడేవరకూ ఫ్రీజ్‌ చేయాలి.

  • తర్వాత ఫ్రిజ్‌ నుంచి తీసి కొద్దిగా కరిగేవరకూ ఐదు నిమిషాలు బయట ఉంచాలి.

  • తర్వాత చిన్న ముక్కలుగా కట్‌ చేసి బ్లెండర్‌లో వేసి క్రీమ్‌లా తయారుచేసి మరో 2 గంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి.

  • ఫ్రిజ్‌ నుంచి బయటకు తీసి తింటే బయటకొన్న ఐస్‌క్రీమ్‌ సాటి లేదనిపించడం ఖాయం.

Icecream - Papaya Icecream

బొప్పాయి ఐస్‌క్రీమ్


కార్న్‌ఫ్లోర్‌ - 2 టే.స్పూన్లు చక్కెర - 1 కప్పు పాలు - 2 కప్పులు గుడ్లు - 2 (తెలుపు పసుపు సొనల్ని విడివిడిగా బీట్‌ చేసుకోవాలి) వెనిల్లా ఎసెన్స్‌ - 4 చుక్కలు బొప్పాయి గుజ్జు - 4 కప్పులు

  • బొప్పాయి గుజ్జు, చక్కెర, కార్న్‌ఫ్లోర్‌లు గిన్నెలో వేసి కలపాలి.

  • దీన్లో నెమ్మదిగా పాలు పోస్తూ కలపాలి..పొయ్యి మీద ఉంచి కలుపుతూ గరిటెకు అంటుకునేవరకూ ఉడికించి చల్లార్చాలి.

  • తర్వాత గుడ్లు తెల్లసొన, వెనిల్లా వేయాలి.బాగా కలిపి ఫ్రిజ్‌లో ఉంచాలి.

  • కాస్త గట్టిపడిన తర్వాత ఫ్రిజ్‌ నుంచి బయటకు తీసి బొప్పాయి గుజ్జు కలపాలి.

  • మరో గంటపాటు ఫ్రిజ్‌లో ఉంచి బయటకు తీసి కలిపి బౌల్స్‌లో వేసుకుని తింటే చల్లచల్లగా బాగుంటుంది.

Icecream - MuskMelon Icecream

తర్బూజా ఐస్‌క్రీమ్


తర్బూజా పండు - 1 చిక్కని పాలు - 1 లీటరు తాజా క్రీమ్‌ - 1 కప్పు చక్కెర - 3/4 కప్పులు కార్న్‌ ఫ్లోర్‌ - 2 టే.స్పూన్లు వెనిల్లా ఎసెన్స్‌ - 2 చుక్కలు.

  • తర్బూజా పండు గుజ్జు చేసి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.పాలు కాగబెట్టి పావు లీటరు పాలు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.చల్లబడ్డ పాలలో కార్న్‌ఫ్లోర్‌ కలపాలి.మిగతా పాలను పావుగంటపాటు మరిగించాలి.

  • ఈ పాలలో ముందుగా కార్న్‌ఫ్లోర్‌ కలిపిన పాలను కొద్దికొద్దిగా పోస్తూ కలపాలి.చిన్న మంట మీద 3 నిమిషాలు మరిగించాలి.మంట తీసి చక్కెర, ఎసెన్స్‌ వేసి కరిగేవరకూ తిప్పి రూమ్‌ టెంపరేచర్‌కు చల్లార్చాలి.

  • ప్లాస్టిక్‌ మూత పెట్టి గడ్డకట్టేవరకూ కాకుండా గట్టిపడేవరకూ ఫ్రీజర్‌లో ఉంచాలి.తర్వాత తీసి మెత్తబడేవరకూ స్పూన్‌తో బీట్‌ చేయాలి.

  • తాజా క్రీమ్‌ను కూడా బాగా బీట్‌ చేసి ఐస్‌క్రీమ్‌కు కలపాలి.తర్వాత తర్బూజా గుజ్జును వేసి కలిపి ఫ్రీజర్‌లో ఉంచాలి.

  • బాగా సెట్‌ అయ్యాక బౌల్స్‌లో తీసి తింటే టేస్టీగా ఉంటుంది.

Icecream - Banana Icecream

బనానా ఐస్‌క్రీమ్


అరటి పళ్లు - 3 పాలు - అర టే.స్పూను

  • అరటి పళ్లు వెడల్పాటి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.వెడల్పాటి ప్లేట్‌లో పరిచి గట్టిగా అయ్యేవరకూ ఫ్రిజ్‌లో ఉంచాలి.

  • బ్లెండర్‌లో వేసి తిప్పాలి. మొదట్లో కరగనట్టు అనిపించినా ఆపి తిప్పుతూ ఉంటే కొంతసేపటికి క్రీమ్‌లా తయారవుతాయి.

  • మరీ గట్టిగా ఉండి క్రీమ్‌లా తయారవకపోతే పాలు కలపాలి.

  • మూత ఉన్న గిన్నెలో పోసి ఫ్రీజర్‌లో ఉంచాలి.గట్టిపడిన తర్వాత తీసి సర్వ్‌ చేయాలి.

  • బ్లెండర్‌లో పళ్ల ముక్కలతోపాటు పీనట్‌ బటర్‌, కోకో పౌడర్‌, వెనిల్లా, దాల్చిన చెక్క పొడి కూడా కలుపుకోవచ్చు.

Wednesday, 9 March 2016

IceCreams - Anzeer Icecream

అంజీర్‌ ఐస్‌


చిక్కని పాలు - అరలీటరు వెన్నతీసిన పాలు - అరలీటరు గిలకొట్టిన క్రీం - టేబుల్‌స్పూను అంజీర్‌ - ఏడు.

  • ఓ గిన్నెలో చిక్కని పాలూ, వెన్నతీసిన పాలూ, గిలకొట్టిన క్రీం తీసుకుని అన్నింటినీ బాగా కలపాలి. మిక్సీ జార్‌లో ఐదు అంజీర్‌ పండ్లు, కాసిని పాలు తీసుకుని మెత్తని గుజ్జులా చేసుకోవాలి.

  • మిగిలిన పండ్లను సన్నగా తరగాలి. ఇప్పుడు అంజీర్‌ గుజ్జునీ, అంజీర్‌ ముక్కల్ని ముందుగా కలిపిన పాల మిశ్రమంలో వేసుకుని ఫ్రీజర్‌లో ఉంచేయాలి.

  • ఇది గట్టిగా అయ్యాక బయటకు తీసి.. మరోసారి మిక్సీలో వేసుకుని మెత్తని గుజ్జులా చేసుకుని మళ్లీ డీప్‌ ఫ్రీజర్‌లో ఉంచేయాలి. ఇలా రెండోసారి మిక్సీపట్టి, మళ్లీ ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల ఐస్‌క్రీం మెత్తగా వస్తుంది.

IceCreams - Lemo Icecream

లెమన్‌


చిక్కని పాలు - ఒకటిన్నర కప్పు గిలకొట్టిన క్రీం - కప్పు నిమ్మపొట్టు - ఒక నిమ్మకాయతో వచ్చేది నిమ్మకాయలు - రెండు (రసం తీసుకోవాలి).

  • ఒక పెద్ద గాజు గిన్నెలో చిక్కని పాలూ, నిమ్మపొట్టూ, నిమ్మరసం, గిలకొట్టిన క్రీం వేసుకుని అన్నింటినీ బాగా కలపాలి.

  • దీన్ని డీప్‌ఫ్రీజర్‌లో ఉంచేయాలి. ఇది గట్టిగా అయ్యాక ఇవతలకు తీసి.. మరోసారి గిలకొట్టి.. మళ్లీ ఫ్రీజర్‌లో ఉంచేయాలి. గట్టిపడ్డాక తీసి తినాలి.

IceCreams - Banana Icecream

బనానా ఐస్‌


చిక్కని లైట్‌ క్రీం - రెండూ కలిపి నాలుగు కప్పులు చక్కెర - రెండున్నర కప్పులు ఉప్పు - చిటికెడు గుడ్లు - నాలుగు గిలకొట్టిన క్రీం - నాలుగు కప్పులు చిక్కని పాలు - అరలీటరు వెనిల్లా ఎసెన్స్‌- టేబుల్‌స్పూను అరటిపండు గుజ్జు - రెండు కప్పులు.

  • ఒక పెద్ద పాన్‌లో చిక్కని, లైట్‌ క్రీంని కప్పు చొప్పున వేసి సన్నని మంటపై ఉంచి వేడి చేయాలి. తరవాత అందులో చక్కెరా, ఉప్పు వేసి బాగా కలపాలి. చక్కెర కరిగేలోగా గుడ్ల సొనను ఓ గిన్నెలో తీసుకుని బాగా గిలకొట్టాలి.

  • ఈ మిశ్రమంలో కాసిని వేడి పాలు వేసుకుని బాగా కలపాలి. తరవాత మిగిలిన పాలల్లో గుడ్ల సొన వేసి మరోసారి కలపాలి. దీన్ని సన్నని మంటపై ఉంచి బాగా కలపాలి.

  • ఇందులో ఒక చెంచాను ముంచితే దానికి ఈ మిశ్రమం అంటుకుంటే వెంటనే దింపేసి పొయ్యి కట్టేయాలి. ఇది చాలా త్వరగా చల్లారాలి. అందుకే ఈ గిన్నెను చల్లని నీళ్లున్న బేసిన్‌లో ఉంచాలి.

  • ఇందులో గిలకొట్టిన క్రీం, పాలూ, వెనిల్లా ఎసెన్స్‌ వేసి బాగా కలిపి... దానిపై ప్లాస్టిక్‌ కాగితాన్ని కప్పి ఫ్రిజ్‌లో నాలుగు నుంచి ఆరు గంటల పాటు చల్లబరుచుకోవాలి.

  • ఆ తరవాత అందులో అరటి గుజ్జు వేసుకుని మెత్తని మిశ్రమంలా అయ్యేవరకూ కలిపి మళ్లీ రెండు నుంచి నాలుగు గంటలు డీప్‌ ఫ్రీజర్‌లో ఉంచాలి.

IceCreams - SweetCorn Icecream

స్వీట్‌కార్న్‌ ఐస్‌


స్వీట్‌కార్న్‌ పొత్తులు - నాలుగు చిక్కటి పాలు - రెండు కప్పులు చిక్కని క్రీం - రెండు కప్పులు చక్కెర - ముప్పావు కప్పు గుడ్లు - నాలుగు (పచ్చసొన మాత్రమే తీసుకోవాలి).

  • ఒక పాన్‌లో స్వీట్‌కార్న్‌ని తీసుకుని దోరగా వేయించుకుని తీసుకోవాలి.

  • ఇప్పుడు ఓ మందపాటి అడుగు ఉన్న గిన్నెలో పాలూ, క్రీం, సగం చక్కెరా, స్వీట్‌కార్న్‌ గింజలూ తీసుకుని పొయ్యి మీద పెట్టాలి. అన్నీ ఉడికాక దింపేయాలి.

  • . ఈ మిశ్రమం చల్లారాక మిక్సీజారులోకి తీసుకుని మెత్తగా చేసుకుని మరో పాన్‌లో వేసి మళ్లీ పొయ్యిమీద పెట్టాలి. ఇప్పుడు కోడిగుడ్ల సొనలో మిగతా పంచదార వేసుకుని బాగా గిలకొట్టుకోవాలి.

  • సన్నని మంటపై మరుగుతున్న మొక్కజొన్న మిశ్రమంలోంచి ఒక కప్పు తీసుకుని కోడిగుడ్డు చక్కెర మిశ్రమంలో వేసుకోవాలి. దీన్ని ఐదు నిమిషాలు వేడి చేసి తరవాత దింపేయాలి.

  • ఇప్పుడు మిగిలిన మొక్కజొన్న మిశ్రమాన్ని కూడా చేర్చాలి. చివరకు. దీన్ని వడకట్టి, చల్లార్చి ఫ్రీజర్‌లో ఉంచేయాలి. నాలుగైదు గంటలయ్యాక ఇవతలకు తీసి మరోసారి మిక్సీ జారులోకి తీసుకుని మెత్తగా చేసుకోవాలి. దీన్ని మళ్లీ ఫ్రిజ్‌లో ఉంచి.. గట్టిపడ్డాక ఇవతలకు తీయాలి.

IceCreams - Chocolate Coconut Icecream

చాక్లెట్‌, కోకోనట్‌ ఐస్‌


చాక్లెట్‌ పొడి - ముప్పావుకప్పు చక్కెర - పది టేబుల్‌స్పూన్లు బ్రౌన్‌ షుగర్‌ - పావుకప్పు కన్నా కొద్దిగా తక్కువగా ఉప్పు- చిటికెడు చిక్కని కొబ్బరి పాలు - ఒకటిన్నర కప్పు వెనిల్లా ఎసెన్స్‌ - అర టేబుల్‌స్పూను.

  • జల్లించిన చాక్లెట్‌ పొడీ, చక్కెరా, బ్రౌన్‌ షుగర్‌, ఉప్పును మిక్సీలో తీసుకుని మెత్తని పిండిలా చేసుకోవాలి.

  • తరవాత కొబ్బరిపాలూ, వెనిల్లా ఎసెన్స్‌ వేసుకుని ఉండలు కట్టకుండా నెమ్మదిగా మిక్సీ తిప్పాలి.

  • ఇప్పుడు ఈ మిశ్రమాన్ని డీప్‌ ఫ్రీజర్‌లో రెండు నుంచి నాలుగు గంటలు ఉంచాలి.

  • దీన్ని మళ్లీ బయటకు తీసి మరోసారి మెత్తని ముద్దలా గిలకొట్టుకోవాలి. తరవాత మళ్లీ ఫ్రీజర్‌లో ఉంచితే.. రెండు మూడు గంటలకు గట్టిపడుతుంది. అప్పుడు తీసుకుని తినాలి.