VTStyles

Recent Post

Tuesday, 26 April 2016

Curry - Nonveg - Tamarind Leaf Prawns Curry

చింతచిగురు రొయ్యల కూర


చింత చిగురు- కప్పు కాస్త పెద్ద రొయ్యలు- పావుకిలో ధనియాల పొడి- చెంచా జీలకర్రపొడి- అరచెంచా ఉల్లిపాయ- ఒకటి కొత్తిమీర- కట్ట వెల్లుల్లి రేకలు- ఐదారు నూనె- మూడు టేబుల్‌స్పూన్లు గసగసాల పొడి - చెంచా దాల్చిన చెక్కపొడి - అరచెంచా అల్లంవెల్లులి పేస్టు- చెంచా పసుపు- చిటికెడు ఉప్పు- తగినంత పచ్చిమిర్చి- ఐదు కారం - చెంచా.

  • ముందుగా రొయ్యలని శుభ్రం చేసి పెట్టుకుని అందులో పసుపూ, కొద్దిగా ఉప్పూ, సగం అల్లంవెల్లుల్లి పేస్టు వేసి వాటికి పట్టేట్టుగా కలిపిపెట్టుకోవాలి.

  • ఇప్పుడు కడాయిలో నూనె వేసి అది వేడెక్కాక తరిగిన ఉల్లిపాయముక్కలూ, పచ్చిమిర్చీ వేసి దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక అందులో రొయ్యలు కూడా వేయాలి.

  • పచ్చివాసన పోయేవరకూ వేయించి అప్పుడు మూత పెట్టి మరికాస్త సేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు చింతచిగురుని అరచేతుల్లో వేసి బాగా నలిపితే పొడిలా తయారవుతుంది. దీన్ని రొయ్యల్లో వేసి మిగిలిన అల్లంవెల్లుల్లి పేస్టూ, వెల్లుల్లిరేకలూ చేర్చాలి.

  • తర్వాత ఉప్పూ, కారం, గసగసాలపొడీ, జీలకర్రపొడి, దాల్చిన చెక్కపొడి, ధనియాలపొడి వేసుకోవాలి. అవన్నీ వేసి బాగా కలిపిన తర్వాత కాసిని నీళ్లు పోసి మూతపెట్టేయాలి.

  • ఇందులో ప్రత్యేకించి మసాలా వేయాల్సిన అవసరం లేదు. కూర దగ్గరకు వచ్చిన తర్వాత దింపేసి, కొత్తిమీరతో అలంకరిస్తే చాలు.

No comments:

Post a Comment