VTStyles

Recent Post

Tuesday, 26 April 2016

Curry - Nonveg - Tamarind Leaf Mutton Curry

చింతచిగురు మటన్ ‌కూర


మటన్‌ - అరకేజీ అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు టేబుల్‌స్పూన్లు పసుపు - చెంచా ఉప్పు - తగినంత చింతచిగురు - కప్పు ఉల్లిపాయలు - రెండు పచ్చిమిర్చి - మూడు లవంగాలు - మూడు దాల్చినచెక్క - చిన్న ముక్క కారం - టేబుల్‌స్పూను నూనె - పావుకప్పు గరంమసాలా - టేబుల్‌స్పూను ఉప్పు - తగినంత.

  • కుక్కర్‌లో మటన్‌ ముక్కలూ, అల్లంవెల్లుల్లి పేస్టూ, పసుపూ, కొద్దిగా ఉప్పూ, చిన్న కప్పు నీళ్లు పోసి మూత పెట్టేయాలి. నాలుగైదు కూతలు వచ్చాక దింపేయాలి.

  • ఇప్పుడు ఓ బాణలిలో నూనె వేడిచేయాలి. అందులో దాల్చినచెక్కా, లవంగాలు వేసుకోవాలి. తరవాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలూ వేయించాలి. ఉల్లిపాయముక్కలు వేగాక కడిగిన చింతచిగురూ, తగినంత ఉప్పూ వేసి మంట తగ్గించేయాలి.

  • . కాసేపటికి చింతచిగురు ఉడుకుతుంది. అప్పుడు ముందుగా ఉడికించిపెట్టుకున్న మటన్‌తో పాటూ కారం, గరంమసాలా వేసి బాగా కలపాలి. ఇది గ్రేవీలా అయ్యేందుకు మరికాసిని నీళ్లు పోసి కొన్ని నిమిషాలయ్యాక దింపేస్తే చాలు.

No comments:

Post a Comment