వంకాయ
![]() |
మరి కొన్ని కూర రుచులు |
సలహాలు & సూచనలు |
మరి కొన్నమాంసం కూర రుచులు |
కావలసిన పదార్థాలు
*వంకాయలు - అరకేజీ
* చింతచిగురు - ఒకటింబావు కప్పు
* సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు - కప్పు
* నూనె - పావుకప్పు
* పసుపు - చెంచా
* ఉప్పు - తగినంత
* పచ్చిమిర్చి - ఐదు
* ఎండుకొబ్బరిపొడి - రెండు టేబుల్ స్పూన్లు
* ధనియాలపొడి - చెంచా
* జీలకర్ర - చెంచా
* సెనగపప్పు - చెంచా
* ఆవాలు - చెంచా
* కూరకారం - అరచెంచా.
తయారుచేయు విధానం
ముందుగా వంకాయల్ని ముక్కల్లా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనెవేడిచేసి జీలకర్రా, ఆవాలూ, సెనగపప్పును వేయించుకోవాలి. అవి వేగాక ఉల్లిపాయముక్కలు వేసేయాలి.
. తర్వాత వంకాయ ముక్కలూ, పసుపూ వేసి మూత పెట్టేయాలి. కాసేపటికి వంకాయముక్కలు కొద్దిగా మగ్గుతాయి.
అప్పుడు కడిగిన చింతచిగురూ, పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. చింతచిగురు మగ్గి, వంకాయముక్కలు వేగాక తగినంత ఉప్పూ, కొబ్బరిపొడి, ధనియాలపొడి, కూరకారం వేసి బాగా కలపాలి. కూర దగ్గర అయ్యాక దింపేస్తే చాలు.
No comments:
Post a Comment