పుచ్చకాయ ఐస్‌క్రీమ్ |
నీళ్లు - పావు కప్పు చక్కెర - పావు కప్పు పుచ్చకాయ గుజ్జు - 4 కప్పులు వెనిల్లా ఫ్లేవర్ పెరుగు - 1 కప్పు నిమ్మరసం - 1 టే.స్పూను .
నీళ్లలో చక్కెర కలిపి వేడిచేసి కరిగాక చల్లార్చాలి.
వెడల్పాటి గిన్నెలో పుచ్చకాయ గుజ్జు వేసి పెరుగు, చక్కెర నీళ్లు, నిమ్మరసం వేసి స్పూన్‌తో బాగా గిలక్కొట్టాలి.
తర్వాత ఈ మిశ్రమాన్ని వడగట్టి గిన్నెలో వేసి 6 గంటలపాటు గట్టిపడేవరకూ ఫ్రీజ్ చేయాలి.
తర్వాత ఫ్రిజ్ నుంచి తీసి కొద్దిగా కరిగేవరకూ ఐదు నిమిషాలు బయట ఉంచాలి.
తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి బ్లెండర్‌లో వేసి క్రీమ్‌లా తయారుచేసి మరో 2 గంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి.
ఫ్రిజ్ నుంచి బయటకు తీసి తింటే బయటకొన్న ఐస్‌క్రీమ్ సాటి లేదనిపించడం ఖాయం.
No comments:
Post a Comment