కీరదోస |
కీరదోస ముక్కలు - ఒకటిన్నర కప్పు పెరుగు - మూడు టేబుల్‌స్పూన్లు నిమ్మరసం - టేబుల్‌స్పూన్లు ఉల్లిపాయ - ఒకటి చిన్నది వెల్లుల్లి రెబ్బలు - రెండు సోయా ఆకులు - కొన్ని కొత్తిమీర తరుగు - పావుకప్పు ఆలివ్‌నూనె - రెండు చెంచాలు ఉప్పు - తగినంత మిరియాలపొడి - చెంచా.
ఉప్పూ, మిరియాలపొడీ తప్ప మిగిలినపదార్థాలన్నీ మిక్సీ జారులోకి తీసుకుని మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమం పల్చగానే ఉండాలి.
అందులో ఉప్పూ, మిరియాలపొడీ వేసుకుని బాగా కలిపి ఫ్రిజ్‌లో పెట్టేయాలి. చల్లగా అయ్యాక తాగాలి.
అయితే తాగేముందు ఓసారి ఉప్పూ, మిరియాలపొడి రుచి చూసుకుని కావాలనుకుంటే కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది.
No comments:
Post a Comment