![]() |
మరి కొన్ని డ్రింక్స్ రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
* పుచ్చకాయ ముక్కలు - రెండు కప్పులు
* బీట్‌రూట్ ముక్కలు - కప్పు
* కమలాఫలం లేదా బత్తాయిరసం - కప్పు
* అల్లం తరుగు - చెంచా
* కూరగాయలు ఉడికించిన నీరు - రెండుకప్పులు
* క్రీం - కొద్దిగా
* ఉప్పూ
* మిరియాలపొడి - రుచికి సరిపడా.
తయారుచేయు విధానం
బీట్‌రూట్ ముక్కలను ఓ గిన్నెలోకి తీసుకుని దానిపై సరిపడా నీళ్లూ, కొద్దిగా ఉప్పూ, మిరియాలపొడీ వేసుకుని పొయ్యిమీద పెట్టాలి. అవి ఉడికాయనుకున్నాక దింపేసి నీటిని వంపేయాలి.
బీట్‌రూట్ ముక్కలు చల్లారాక మిక్సీలో జారులోకి తీసుకోవాలి. అందులో క్రీం తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసుకుని మెత్తగా చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని కప్పుల్లోకి తీసుకుని పైన క్రీం వేస్తే చాలు.
No comments:
Post a Comment