రోస్టెడ్ బనానా |
అరటిపండ్లు - రెండు చక్కెర - టేబుల్‌స్పూను వెన్న - రెండు టేబుల్‌స్పూన్లు నిమ్మరసం - చెంచా బెల్లం తరుగు - రెండు టేబుల్‌స్పూన్లు ఐసింగ్ షుగర్ - రెండు చెంచాలు.
అరటిపండ్లను నిలువుగా రెండు ముక్కల్లా కోసి బేకింగ్ ట్రేలో సర్దుకోవాలి.
చక్కెరా, వెన్నా, నిమ్మరసం, బెల్లం తరుగూ, ఐసింగ్ షుగర్‌ని మరోగిన్నెలోకి తీసుకుని అన్నింటినీ బాగా కలపాలి.
ఇప్పుడు అరటిపండు ముక్కలపై ఈ మిశ్రమాన్ని రాసి, కనీసం ఇరవై అయిదు నిమిషాల నుంచి అరగంట సేపు బేక్ చేస్తే చాలు.. అరటిపండు గోధుమరంగులోకి మారుతుంది. అంతే రోస్టెడ్ బనానా సిద్ధం. దీన్ని వేడివేడిగా తింటేనే బాగుంటుంది.
No comments:
Post a Comment