VTStyles

Recent Post

Thursday, 5 May 2016

Breakfast - Vada - Rajma Perugu Vada

రాజ్‌మా పెరుగు వడ


రాజ్‌మా - అరకప్పు ఆలూ ఉల్లిపాయ - పెద్దవి ఒక్కోటి చొప్పున పచ్చిమిర్చి - రెండు గరంమసాలా - టేబుల్‌స్పూను అల్లం - చిన్నముక్క బ్రెడ్‌పొడి - అరకప్పు ఉప్పు - తగినంత ఆవాలు - అరచెంచా మినప్పప్పు - చెంచా కరివేపాకు రెబ్బలు - కొన్ని చిక్కని పెరుగు - ఒకటిన్నర కప్పు కారం చాట్‌మసాలా - అరచెంచా చొప్పున నూనె - వేయించేందుకు సరిపడా.

చింతపండు చట్నీ కోసం

చింతపండు- అరకప్పు బెల్లం -రెండు కప్పులు నీళ్లు - రెండు కప్పులు వేయించిన జీలకర్రపొడి - టేబుల్‌స్పూను నల్లఉప్పు - అరచెంచా కారం - చెంచా మిరియాలపొడి - చెంచా ఉప్పు - కొద్దిగా శొంఠిపొడి - అరచెంచా.

  • ముందుగా చింతపండు చట్నీ తయారు చేసుకోవాలి. చింతపండును ఓ గిన్నెలోకి తీసుకుని నీళ్లు పోసి కాసేపు నాననివ్వాలి. తరవాత గుజ్జు తీసుకుని పెట్టుకోవాలి. అందులో మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలిపితే చాలు. దీన్ని డబ్బాలోకి తీసుకుంటే రెండు రోజులు నిల్వ ఉంటుంది.

  • ఇప్పుడు వడలు చేసుకోవాలి. రాజ్‌మాను ముందురోజు రాత్రే నానబెట్టుకోవాలి. మర్నాడు నీళ్లు వంపేసి మరీ గట్టిగా, అలాగని మెత్తగా కాకుండా రుబ్బుకోవాలి

  • . ఇందులో ఉడికించిన ఆలూ ముద్దా, ఉల్లిపాయ ముక్కలూ, పచ్చిమిర్చి తరుగూ, గరంమసాలా, అల్లం తరుగూ, బ్రెడ్‌పొడీ, తగినంత ఉప్పూ వేసుకుని బాగా కలపాలి. దీన్ని ఉండల్లా చేసుకుని కాగుతోన్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.

  • ఇవి చల్లారేలోగా పెరుగును ఓ సారి గిలకొట్టి, అందులో కొద్దిగా ఉప్పూ, కారం, చాట్‌మాసాలా వేసి కలపాలి. తరవాత వడలు వేసుకోవాలి.

  • ఇప్పుడు బాణలిలో రెండు చెంచాల నూనె వేడిచేసి ఆవాలూ, మినప్పప్పూ, కరివేపాకు రెబ్బలూ వేయించి పెరుగుపై వేయాలి. చివరగా పైనుంచి చింతపండు చట్నీ పెరుగువడలపై పడేలా అలంకరిస్తే చాలు.

No comments:

Post a Comment