VTStyles

Recent Post

Friday, 6 May 2016

Biriyani - Avadi Biriyani

అవధి దమ్ బిర్యానీ


చికెన్ (స్కిన్‌లెస్) - అరకేజీ పచ్చిమిర్చి - 10 ఉల్లిపాయ తరుగు (వేయించినవి) - 100 గ్రా.లు అల్లం - వెల్లుల్లి ముద్ద - 2 టీ స్పూన్లు పెరుగు - 100 గ్రా.లు కారం - 1 టేబుల్ స్పూన్ పసుపు - అర టీ స్పూన్ జీలకర్ర పొడి - టీ స్పూన్ ఉప్పు-తగినంత

చికెన్ ఉడికించడానికి.

నెయ్యి - 100 గ్రా.లు దాల్చిన చెక్క - చిన్న ముక్క కొత్తిమీర - 150 గ్రా.లు యాలకులు - 6 లవంగాలు - 8 అన్నం వండటానికి.. బాస్మతి /బిర్యానీ రైస్ - 400 గ్రా.లు లేదా 2 కప్పులు ఉప్పు - తగినంత సాజీర - టీ స్పూన్; అనాసపువ్వు - 4

అలంకరణకు

కుంకుమపువ్వు - చిటికెడు (పావు కప్పు నీళ్లలో కలపాలి) కొత్తిమీర తరుగు - 6 టేబుల్ స్పూన్లు పుదీనా ఆకులు - కప్పు వెల్లుల్లి (వేయించినవి) - అర కప్పు

  • ఒక గిన్నెలో చికెన్ ముక్కలు వేసి, అందుకు కావల్సిన పదార్థాలన్నీ (పైన ఇచ్చినవి) వేసి కలిపి, 2 గంటలకు పక్కనుంచాలి.

  • గిన్నెలో నెయ్యి వేసి, మసాలా దినుసులన్నీ వేసి వేయించాలి. దీంట్లో సిద్ధంగా ఉంచుకున్న చికెన్‌ను వేసి కలపాలి. 15-20 నిమిషాల సేపు సన్నని మంట మీద ఉడికించాలి. తర్వాత మంట తీసేసి, కొత్తిమీర వేసి మరో 10 నిమిషాలుంచాలి.

  • బాస్మతి రైస్‌లో తగినన్ని నీళ్లు పోసి గంటసేపు నానబెట్టాలి. గిన్నె పొయ్యి మీద పెట్టి, సాజీర, ఉప్పు, బిర్యానీ ఆకు, నీళ్లు పోసి మరిగించాలి.

  • . దీంట్లో వడకట్టిన బియ్యం వేసి సగం ఉడికేంతవరకు ఉంచాలి. కుండ లేదా మందపాటి గిన్నెలో ఒక పొర ఉడికీ ఉడకని అన్నం పైన చికెన్, ఆ పైన అన్నం, .. ఇలా అంతా పూర్తి చేసి మళ్లీ అన్నం అంతా ఉడికేదాకా స్టౌమీద పెట్టాలి. ఆవిరి బయటకు పోకుండా మూతపెట్టాలి. సన్నని మంట మీద ఉంచాలి.

No comments:

Post a Comment