![]() |
మరి కొన్ని ఫుడ్డింగ్ రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
* మేరీగోల్డ్ బిస్కెట్లు - పది
* మిల్క్‌మెయిడ్ - ఒక డబ్బా (బజార్లో దొరుకుతుంది)
* వెన్న - అరకప్పు
* చాక్లెట్ తరుగు - అరకప్పు
* నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు
* నీళ్లు - అరకప్పు
* జీడిపప్పు పలుకులు - అరకప్పు
* చాక్లెట్‌పొడి - రెండు టేబుల్‌స్పూన్లు
* వాల్‌నట్ పలుకులు - కొన్ని
* చక్కెర - అరకప్పు.
తయారుచేయు విధానం
వెడల్పాటి బాణలి తీసుకుని అందులో చక్కెరా, వెన్నా, చాక్లెట్‌పొడీ, నీళ్లూ, నెయ్యి వేసుకుని పొయ్యిమీద పెట్టాలి. చాక్లెట్, వెన్నా కరిగాక దింపేయాలి.
ఇప్పుడు వెడల్పాటి బేకింగ్ బౌల్‌లో బిస్కెట్లను ముక్కల్లా చేసి పరవాలి. దానిపై మిల్క్‌మెయిడ్, తరవాత చాక్లెట్ మిశ్రమం వేయాలి.
ఇప్పుడు జీడిపప్పు, వాల్‌నట్ పలుకులూ అలంకరించి.. పది నిమిషాలు బేక్ చేసుకుంటే చాలు.
No comments:
Post a Comment