VTStyles

Recent Post

Tuesday, 17 May 2016

Bakery - Dessert - Khubani Ka Meetha

ఖుబానీ కా మీఠా


ఎండు ఖుబానీ పండ్లు(ఎండు ఆప్రికాట్స్‌)-అర కిలో పంచదార-250గ్రా క్రీమ్‌-100గ్రా నీళ్లు-ఒక లీటరు.

  • ముందుగా ఖుబానీ పండ్లను శుభ్రంగా కడిగి వాటిని ఒక గిన్నెలో వేసి అందులో నీళ్లు పోసి స్టవ్‌పై ఉంచి ఉడికించాలి.

  • ఉడికాక దించి 3-4 గంటలు చల్లార్చాలి. వాటిలోని గింజలను తీసి పక్కన ప్లేటులో ఉంచుకుని, ఖుబానీ పండ్లలో పంచదార వేసి స్టవ్‌పై ఉంచాలి.

  • మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ ఖుబానీ పండ్ల గుజ్జు బాగా దగ్గరికి అయ్యే వరకు ఉంచి దించేయాలి. ఇప్పుడు ఖుబానీ పండ్ల గింజలను పగలగొట్టి మధ్యలో ఉండే పప్పును తీసి గంట సేపు నీటిలో నానబెట్టాలి.

  • తర్వాత వాటిపై ఉండే పొరను వలిచేయాలి. వీటిని ఖుబానీ గుజ్జులో కలపాలి. తినే ముందు ఖుబానీ కా మీఠాను బౌల్‌లోకి తీసుకుని పైన పాల క్రీమ్‌గాని లేదంటే వెనీలా ఐస్‌క్రీంగాని వేసి, పుదీన ఆకులు, చెర్రీతో అలంకరించాలి.

No comments:

Post a Comment