సగ్గుబియ్యం |
సగ్గుబియ్యం వడియాలు - కప్పు క్యారెట్ బంగాళాదుంప క్యాప్సికం బీన్స్ ముక్కలు - అన్నీ కలిపి మూడు కప్పులు ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు అల్లంవెల్లుల్లి పేస్టు - చెంచా జీలకర్ర - చెంచా పసుపు - కొద్దిగా ఉప్పు - తగినంత నూనె - ముప్పావుకప్పు ధనియాలపొడి - అరచెంచా కొబ్బరితురుము - కొద్దిగా.
బాణలిలో అరకప్పు నూనె వేడిచేసి వడియాలను వేయించి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాణలిలో రెండు చెంచాల నూనె వేడి చేసి జీలకర్రా వేయించుకోవాలి.
తరవాత అల్లంవెల్లుల్లి పేస్టూ, కూరగాయ ముక్కలన్నింటినీ వేయాలి. కొన్ని చుక్కల నీళ్లు చల్లి మూత పెట్టి, మంట తగ్గిస్తే.. కాసేపటికి కూరముక్కలు మగ్గుతాయి.
అప్పుడు పసుపూ, సరిపడా ఉప్పూ, ధనియాలపొడీ, కొబ్బరితురుమూ వేసి బాగా కలపాలి. కూరలా తయారయ్యాక వడియాలు వేసి బాగా కలపాలి. రెండు నిమిషాలయ్యాక దింపేస్తే చాలు.
No comments:
Post a Comment