![]() |
మరి కొన్ని కుల్ఫీ రుచులు |
కావలసిన పదార్థాలు
* పాలు- 4 కప్పులు
* డైఫ్రూట్స్- 1 కప్పు
* పంచదార- 1 కప్పు
* కోవా- అరకప్పు
* కండెన్సడ్ మిల్క్ (స్వీట్)- అరలీటరు.
తయారుచేయు విధానం
డ్రైఫ్రూట్స్‌ను దోరగా వేగించి, చల్లారాక గరుకుగా మిక్సీ పట్టాలి. తరువాత పాలను సగం అయ్యేవరకూ మరిగించి కోవా, కండెన్సడ్ మిల్క్, డ్రైఫ్రూట్స్ ముక్కలను వేసి మిశ్రమం క్రీమీగా తయారయ్యే వరకూ కలుపుతూ ఉడికించాలి.
తరువాత పంచదార వేసి మరో రెండు నిమిషాలు ఉడికించి దించేయాలి. మిశ్రమం చల్లారాక కుల్ఫీ మౌల్డ్‌లలో పోసి ఐదారుగంటలపాటు డీప్ ఫ్రీజర్‌లో ఉంచాలి.
No comments:
Post a Comment