![]() |
మరి కొన్ని కుల్ఫీ రుచులు |
కావలసిన పదార్థాలు
* చిన్న సైజు గులాబ్ జామ్‌లు- 12
* పాలు- 5 కప్పులు
* పాలపొడి- 3 టేబుల్ స్పూన్లు
* కార్న్‌ఫ్లోర్- 1 టేబుల్ స్పూను
* కండెన్సడ్ మిల్క్ (స్వీట్)- అరలీటరు
* పచ్చికోవా- 3 టేబుల్ స్పూన్లు
* పంచదార- 1 కప్పు .
తయారుచేయు విధానం
నాలుగున్నర కప్పుల పాలను సగం అయ్యేవరకూ మరిగించాలి. తరువాత అరకప్పు పాలలో పాలపొడి, కార్న్‌ఫ్లోర్ కలిపి పేస్ట్‌లా చేసి దానిని కూడా మరుగుతున్న పాలతో చేర్చి మరో ఐదునిమిషాలు కలుపుతూ ఉడికించాలి.
తరువాత ఆ మిశ్రమానికి కండెన్సడ్ మిల్క్, కోవా, పంచదార చేర్చి బాగా కలిపి పదార్థం చిక్కగా అయ్యే వరకూ కలుపుతూ ఉడికించాలి.
ఆ తరువాత గులాబ్‌జామ్‌లు వేసి దించేయాలి. మిశ్రమం చల్లారాక కుల్ఫీ మౌల్డ్‌లో పోసి డీప్ ఫ్రీజర్‌లో ఐదు గంటలపాటు ఉంచాలి.
No comments:
Post a Comment