VTStyles

Recent Post

Showing posts with label Bake_Kulfi. Show all posts
Showing posts with label Bake_Kulfi. Show all posts

Friday, 1 July 2016

Bakery - Kulfi - Grapes Kulfi / ద్రాక్ష కుల్ఫీ

ద్రాక్ష కుల్ఫీ


చిక్కనిపాలు - మూడుకప్పులు చక్కెర - మూడు టేబుల్‌స్పూన్లు పిస్తా పొడి - పావుకప్పు కోవా - వంద గ్రా టొనోవిన్‌ ఎసెన్సు - టేబుల్‌ స్పూను (ఇది బజార్లో దొరుకుతుంది).

  • పాలల్లో చక్కెర కలిపి పొయ్యిమీద పెట్టి, మరిగించాలి. తరవాత అందులో కోవా తురుమూ, పిస్తా పొడీ వేసి మరోసారి కలిపి పొయ్యిమీద పెట్టాలి.

  • పాలు సగం అయ్యాక దింపేసి టోనోవిన్‌ వేసి మిక్సీ పట్టాలి. దీన్ని కుల్ఫీమౌల్డ్స్‌లోకి తీసుకుని డీప్‌ ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆరేడు గంటలయ్యాక ఆ మౌల్డ్స్‌ని తిరగేస్తే కుల్ఫీ రెడీ.

Bakery - Kulfi - Mango Kulfi / మ్యాంగో కుల్ఫీ

మ్యాంగో కుల్ఫీ


చిక్కనిపాలు - మూడు కప్పులు చక్కెర - మూడు టేబుల్‌స్పూన్లు కోవా - వంద గ్రా జీడిపప్పు పొడి - పావుకప్పు మ్యాంగో ఎమల్షన్‌ - రెండు టేబుల్‌స్పూన్లు (ఇది మామిడి రంగులో రుచిలో ఉండే ఎసెన్స్‌. బజార్లో దొరుకుతుంది) కుల్ఫీమౌల్డ్స్‌- రెండుమూడు.

  • ముందుగా పాలను బాగా మరిగించి అందులో కోవాను తురిమి వేయాలి. రెండు నిమిషాలయ్యాక చక్కెర వేయాలి. అది కరిగాక జీడిపప్పు పొడి వేసి బాగా కలిపి మంట తగ్గించాలి.

  • పాలు సగం అయ్యేవరకూ మరిగించి పొయ్యి కట్టేయాలి. పాలు బాగా చల్లారాక మ్యాంగో ఎమల్షన్‌ కూడా కలిపి ఓ నిమిషం మిక్సీ పట్టాలి.

  • తరవాత ఈ మిశ్రమాన్ని కుల్ఫీ మౌల్డ్స్‌లోకి తీసుకుని మూతపెట్టేసి డీప్‌ ఫ్రిజ్‌లో ఉంచాలి. ఎనిమిది గంటలయ్యాక బయటకు తీస్తే మ్యాంగో కుల్ఫీ సిద్ధం.

Bakery - Kulfi - Plain Kulfi

¹×Mp´


¤¶Äušü NÕ©üˆÐ 骢œ¿Õ-Êoª½ ¹X¾Ûp©Õ ¹¢œç-¯þqœþ NÕ©üˆÐ ƪ½-¹X¾Ûp NÕ©üˆ ¤ùœ¿ªýÐ ¤Ä«Û-¹X¾Ûp §ŒÖ©-¹×-©-¤ñœËРƪ½-Íç¢Íà °œË-X¾X¾Ûp, ¦ÇŸ¿¢ X¾©Õ-¹שÕÐ ÂíCl’Ã

  • ŠÂ¹ T¯ço©ð ¤¶Äušü NÕ©üˆ, ¹¢œç-¯þqœþ NÕ©üˆ, NÕ©üˆ-¤ù-œ¿ªý B®¾Õ-¹×E ¦Ç’à ¹LXÏ «ÕJ-T¢-ÍÃL. ÅŒªÃyÅŒ Æ¢Ÿ¿Õ©ð §ŒÖ©-¹ש ¤ñœË, °œË-X¾X¾Ûp, ¦ÇŸ¿¢ X¾©Õ-Â¹×©Õ „ä®Ï «Õªî 20 ENÕ-³Ä©Õ «Õª½-’¹-E-„ÃyL.

  • ¨ NÕ“¬Á-«ÖEo ÆX¾Ûp-œ¿-X¾Ûpœ¿Ö ¹©Õ-X¾ÛÅŒÖ …¢œÄL. ÅŒªÃyÅŒ „äœË ÍŒ©Çx-ª½-E*a ¨ NÕ“¬Á-«ÖEo ¹×Mp´ «Õø©üfq©ð „䮾Õ¹×E ÆN ’¹šËd-X¾œä «ª½Â¹× ªÃ“ÅŒ¢Åà “X¶Ïèü©ð …¢ÍÃL.

  • „ÚËE ®¾ªýy Íäæ® 5 ENճĩ «á¢Ÿ¿Õ ¦§ŒÕ-{Â¹× B®Ï Æ¢Ÿ¿Õ©ð X¾Û©xÊÕ ’¹Õ*a èÇ“’¹-ÅŒh’à «Õø©üfq ÊÕ¢* „䪽Õ-Íä-§ŒÖL. Æ¢Åä.. ¹«ÕtE ¹×Mp´ ª½œÎ..!

Bakery - Kulfi - Rose Kulfi / రోజ్‌ కుల్ఫీ

రోజ్‌ కుల్ఫీ


చిక్కనిపాలు- మూడు కప్పులు చక్కెర - మూడు టేబుల్‌స్పూన్లు బాదంపొడి - పావుకప్పు కోవా - వంద గ్రా రోజ్‌ సిరప్‌ - టేబుల్‌ స్పూను రూ అఫ్జా - టేబుల్‌ స్పూను (ఈ రెండూ బజార్లో దొరుకుతాయి).

  • పాలల్లో చక్కెర వేసి మరిగించాలి. తరవాత అందులో కోవా తురుము, బాదంపొడి వేసి బాగా కలిపి పాలు సగం అయ్యాక పొయ్యిమీద నుంచి దింపేయాలి.

  • అవి చల్లారాక రోజ్‌ సిరప్‌, రూ అఫ్జా వేసి బాగా కలిపి ఓసారి మిక్సీ పట్టాలి. ఇలా చేసుకున్న మిశ్రమాన్ని కుల్ఫీమౌల్డ్స్‌లోకి తీసుకుని ఎనిమిది గంటలపాటు డీప్‌ ఫ్రిజ్‌లో ఉంచితే సరిపోతుంది.

Sunday, 8 May 2016

Bakery - Kulfi - Dryfruit Kulfi

డ్రైఫ్రూట్స్‌ కుల్ఫీ


పాలు- 4 కప్పులు డైఫ్రూట్స్‌- 1 కప్పు పంచదార- 1 కప్పు కోవా- అరకప్పు కండెన్సడ్‌ మిల్క్‌ (స్వీట్‌)- అరలీటరు.

  • డ్రైఫ్రూట్స్‌ను దోరగా వేగించి, చల్లారాక గరుకుగా మిక్సీ పట్టాలి. తరువాత పాలను సగం అయ్యేవరకూ మరిగించి కోవా, కండెన్సడ్‌ మిల్క్‌, డ్రైఫ్రూట్స్‌ ముక్కలను వేసి మిశ్రమం క్రీమీగా తయారయ్యే వరకూ కలుపుతూ ఉడికించాలి.

  • తరువాత పంచదార వేసి మరో రెండు నిమిషాలు ఉడికించి దించేయాలి. మిశ్రమం చల్లారాక కుల్ఫీ మౌల్డ్‌లలో పోసి ఐదారుగంటలపాటు డీప్‌ ఫ్రీజర్‌లో ఉంచాలి.

Bakery - Kulfi - Gulab Jamun Kulfi

గులాబ్‌జామ్‌ కుల్ఫీ


చిన్న సైజు గులాబ్‌ జామ్‌లు- 12 పాలు- 5 కప్పులు పాలపొడి- 3 టేబుల్‌ స్పూన్లు కార్న్‌ఫ్లోర్‌- 1 టేబుల్‌ స్పూను కండెన్సడ్‌ మిల్క్‌ (స్వీట్‌)- అరలీటరు పచ్చికోవా- 3 టేబుల్‌ స్పూన్లు పంచదార- 1 కప్పు .

  • నాలుగున్నర కప్పుల పాలను సగం అయ్యేవరకూ మరిగించాలి. తరువాత అరకప్పు పాలలో పాలపొడి, కార్న్‌ఫ్లోర్‌ కలిపి పేస్ట్‌లా చేసి దానిని కూడా మరుగుతున్న పాలతో చేర్చి మరో ఐదునిమిషాలు కలుపుతూ ఉడికించాలి.

  • తరువాత ఆ మిశ్రమానికి కండెన్సడ్‌ మిల్క్‌, కోవా, పంచదార చేర్చి బాగా కలిపి పదార్థం చిక్కగా అయ్యే వరకూ కలుపుతూ ఉడికించాలి.

  • ఆ తరువాత గులాబ్‌జామ్‌లు వేసి దించేయాలి. మిశ్రమం చల్లారాక కుల్ఫీ మౌల్డ్‌లో పోసి డీప్‌ ఫ్రీజర్‌లో ఐదు గంటలపాటు ఉంచాలి.

Bakery - Kulfi - MangoKulfi

మామిడి కుల్ఫీ


పెద్ద మామిడి పళ్ళు- 2 పాలు- 4 కప్పులు క్రీం- 1/2 కప్పు కండెన్సడ్‌ మిల్క్‌(స్వీట్‌)- అరలీటరు పిస్తా బాదం తురుము- 1 టేబుల్‌ స్పూను కుంకుమపువ్వు- అరటీస్పూను పంచదార- 1 కప్పు.

  • పాలు సగం అయ్యేవరకూ మరిగించాలి. తరువాత క్రీం, కండెన్సడ్‌ మిల్క్‌లను కూడా పోసి సన్నని మంటమీద పదార్థం చిక్కగా క్రీంలా అయ్యేవరకూ కలుపుతూ ఉడికించాలి.

  • ఆ తరువాత పంచదార వేసి మరో రెండు నిమిషాలు ఉడికించి పిస్తా, బాదం తురుము, కుంకుమపువ్వు వేసి దించేయాలి.

  • తరువాత మామిడిపండు చెక్కుతీసి, సగానికి కోసి టెంక తీసివేయాలి. ముక్కల మధ్య భాగంలో కొంత గుజ్జును తీసేసి ఆ ఖాళీలో పాలమిశ్రమాన్ని పోసి ఐదారుగంటలపాటు డీప్‌ ఫ్రీజర్‌లో ఉంచాలి.

Bakery - Kulfi - ChocolateKulfi

చాక్లెట్‌ కుల్ఫీ


డార్క్‌ చాక్లెట్‌ తురుము పంచదార కండెన్సడ్‌ మిల్క్‌- ఒక్కోటి అరకప్పు చొప్పున పచ్చికోవా- 3/4 కప్పు పాలు- 1 లీటరు.

  • పాలు మూడింట ఒక వంతు అయ్యేవరకూ మరిగించాక కోవా, కండెన్సడ్‌ మిల్క్‌లను కూడా వేసి మరో ఐదునిమిషాలు కలుపుతూ ఉడికించాలి.

  • తరువాత పంచదార, చాక్లెట్‌ తురుము కూడా వేసి కలిపి మరో రెండు నిమిషాలు ఉడికించాక దించేయాలి.

  • ఈ మిశ్రమం చల్లారాక కుల్ఫీ మౌల్డ్‌లలో పోసి ఐదారుగంటలపాటు డీప్‌ ఫ్రీజర్‌లో ఉంచాలి.