ఆపిల్ దహీ వడ |
గ్రీన్ యాపిల్స్ - 2 మొక్కజొన్నపిండి (కార్న్‌ఫ్లోర్) ఒక స్పూన్ వేగించి పొడి కొట్టిన ఓట్స్ - 1/4 కప్పు బ్రెడ్ స్లయిస్‌లు - ఆరు ఉప్పు - తగినంత ఉడికించిన బంగాళదుంప - ఒకటి ఉల్లి - ఒకటి పచ్చిమిరపకాయలు - రెండు చాట్ మసాలా ఒకటి గట్టిపెరుగు - రెండు కప్పులు సన్న కారప్పూస - కొద్దిగా వేగించిన కొత్తిమీర జీలకర్రలు కొద్దిగా.
ఒక గిన్నెలో ఓట్స్ పిండి, బ్రెడ్ స్లయిస్‌లు, ఉడికించిన బంగాళదుంప, ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. తరువాత యాపిల్ తురుమును ఇందులో కలిపి వడపిండిలా తయారుచేసుకోవాలి. వడపిండిలా ఉన్నప్పటికీ జారుతున్నట్టు ఉంటే కనుక మొక్కజొన్నపిండి కలపాలి.
తరువాత పొయ్యి మీద మూకుడు పెట్టి నూనె వేడి చేసి వడల్లా వేయాలి. లేత బంగారు రంగులో వేగాక తీసి ప్లేట్‌లో పెట్టుకోవాలి.
మరో గిన్నెలో గట్టి పెరుగు తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, కారం, చాట్‌మసాలా వేసి కలపాలి. వడలన్నీ దాంట్లో వేసి పది నిమిషాలు ఉంచితే మెత్తగా అవుతాయి.
వీటిని సర్వ్ చేసేటపడు పైన కారప్పూస, కొత్తిమీర, యాపిల్ తరుము చల్లాలి.
No comments:
Post a Comment