చిలగడ దుంప బజ్జీలు |
చిలగడ దుంప (పెద్దది) -1 శనగపిండి - 1 కప్పు బియ్యప్పిండి - పావు కప్పు కారం - 1 టీ స్పూను వాము పొడి - పావు టీ స్పూను వంటసోడా - చిటికెడు ఉప్పు - రుచికి తగినంత నూనె - వేగించడానికి సరపడా.
ఒక వెడల్పాటి లోతైన పాత్రలో శనగపిండి, బియ్యప్పిండి, కారం, వాముపొడి, ఉప్పు వేసి తగినంత నీటితో జారుగా కలుపుకోవాలి.
చిలగడదుంప తొక్కతీసి, కొద్ది దళసరిగా చక్రాల్లా తరిగి, పిండిలో ముంచి, నూనెలో వేగించాలి. వేడివేడిగా టమోటా (కారం) సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.
No comments:
Post a Comment