VTStyles

Recent Post

Tuesday, 3 May 2016

Curry - Lenthil - Dahi Katta Moong

దహీ కట్టా మూంగ్‌


పెసలు - కప్పు పుల్లటి పెరుగు - ఒకటిన్నర కప్పు కారం - అరచెంచా పసుపు - పావుచెంచా ఉప్పు - తగినంత నూనె - రెండు టేబుల్‌స్పూన్లు సెనగపిండి - టేబుల్‌స్పూను ఆవాలు - చెంచా కరివేపాకు - రెండు రెమ్మలు అల్లం పచ్చిమిర్చి పేస్టు - అరచెంచా కొత్తిమీర -కొద్దిగా.

  • పెసల్ని ముందురోజు రాత్రే నీటిలో నానబెట్టుకోవాలి. మర్నాడు అదే నీటితో సహా కుక్కర్‌లో ఉడికించుకోవాలి. అయితే మరీ మెత్తగా కాకుండా రెండు కూతలు వచ్చేవరకూ ఉడికించుకుని తీసుకుంటే చాలు.

  • నీటిని వంపేసి ఉడికించిన పెసల్ని ఓ గిన్నెలోకి మార్చుకోవాలి. ఇప్పుడు పెరుగును గిలకొట్టి అందులో కారం, పసుపూ, సెనగపిండీ వేసి బాగా కలపాలి. తరవాత తగినంత ఉప్పూ, అల్లం పచ్చిమిర్చి పేస్టు వేయాలి.

  • ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి ఆవాలూ, కరివేపాకు వేయించి అందులో ఉడికించిన పెసల్ని వేయాలి. రెండు నిమిషాలు వేయించి తరవాత పెరుగూ, కాసిని నీళ్లు పోసి మంట తగ్గించాలి. ఇది దగ్గరకు అయ్యాక దింపేసి కొత్తిమీర అలంకరిస్తే చాలు.

No comments:

Post a Comment