VTStyles

Recent Post

Monday, 2 May 2016

Drinks - Juice - Raw Mango Juice

మ్యాంగో డ్రింక్‌


పచ్చిమామిడికాయ గుజ్జు: కప్పు పంచదార లేదా బెల్లం తురుము: కప్పు కుంకుమపువ్వు: పావుటీస్పూను యాలకులపొడి: అరటీస్పూను ఉప్పు: చిటికెడు

  • ముందుగా మామిడికాయలు శుభ్రంగా కడగాలి. గిన్నెలో మరిగించిన నీళ్లను పోసి అందులో ఈ మామిడికాయలను వేసి పదిహేను నిమిషాలు ఉంచాలి. తరవాత ఈ గిన్నెను కుక్కర్‌లో పెట్టి రెండు విజిల్స్‌ రానివ్వాలి.

  • మామిడికాయలు చల్లగా అయిన తరవాత తొక్క తీసేసి గుజ్జుని పిండాలి. ఇప్పుడు ఈ గుజ్జుని బెల్లంతురుముతో కలిపి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి.

  • తరవాత అందులోనే యాలకులపొడి, కుంకుమపువ్వు వేసి కలపాలి. దీన్ని ఫ్రిజ్‌లో పెట్టి కావాలనుకున్నప్పుడు గ్లాసులో పావువంతు గుజ్జు వేసి చల్లనినీళ్లు పోసి బాగా కలిపి అందించాలి.

  • ఇందులోనే కుంకుమపువ్వు, యాలకులపొడికి బదులుగా టీస్పూను జీలకర్ర పొడి, టీస్పూను నల్లఉప్పు, పావు టీస్పూను సొంఠిపొడి, చిటికెడు ఉప్పు కూడా వేసుకుని కలుపుకోవచ్చు.

No comments:

Post a Comment