కార్న్‌ఫ్లేక్స్ దహీ కె కబాబ్ |
గడ్డ పెరుగు - ఒకటిన్నర కప్పు కొత్తిమీర కట్ట - ఒకటి ధనియాలు - అరచెంచా సెనగపిండి - టేబుల్‌స్పూను మ్యుసెలీ లేదా కార్న్‌ఫ్లేక్స్ - పావుకప్పు జీలకర్రపొడి - అరచెంచా యాలకులపొడి - అరచెంచా ఉప్పు - తగినంత నూనె - వేయించేందుకు సరిపడా ఉల్లిపాయ - ఒకటి వెనిగర్ - చెంచా చిక్కని పెరుగు - అరకప్పు మిరియాలపొడి - కొద్దిగా.
పెరుగును ఓ గిన్నెలోకి తీసుకుని అందులో ధనియాలపొడీ, సెనగపిండీ, జీలకర్రపొడీ, వెనిగర్, కొత్తిమీర తరుగూ, యాలకులపొడీ, తగినంత ఉప్పూ వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న పట్టీల్లా చేసుకుని తరవాత మ్యూసెలీ లేదా కార్న్‌ఫ్లేక్స్‌లో అద్దాలి.
వీటిని కాగుతోన్న నూనెలో వేసి వేయించుకుని తీసుకోవాలి. దీన్ని ఉల్లిపాయముక్కలు, మిరియాలపొడీ, ఉప్పు వేసిన పెరుగుతో కలిపి వడ్డించాలి.
No comments:
Post a Comment