పాండిచ్చేరి చికెన్ కర్రీ |
ఉల్లిపాయలు - 3 (తరగాలి) టొమాటోలు (పెద్దవి) - 2 జీలకర్ర - టీ స్పూన్ దాల్చిన చెక్క - చిన్న ముక్క లవంగాలు - 2; సోంపు - టీ స్పూన్ అల్లం - చిన్న ముక్క; వెల్లుల్లి - 6 రెబ్బలు ఎండుమిర్చి - 6; యాలకులు - 2 నూనె - ఒకటిన్నర టేబుల్ స్పూన్ చికెన్ లేదా మటన్ - అర కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్- అర టీ స్పూన్ ఉప్పు - రుచికి తగినంత; నూనె - 2 టేబుల్ స్పూన్లు; (చికెన్ లేదా మటన్, అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నూనె, కొద్దిగా నీళ్లు కలిపి ఉడికించాలి) నూనె - 3 టేబుల్ స్పూన్లు; బిర్యానీ ఆకు - 1 సోంపు - టీ స్పూన్; కరివేపాకు - రెమ్మ ధనియాల పొడి - 2 టేబుల్ స్పూన్లు
కడాయిలో నూనె వేసి వేడయ్యాక కరివేపాకు, సోంపు, బిర్యానీ ఆకు వేయించాలి.
ఉల్లిపాయలు, టొమాటోలు,జీలకర్ర,దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం, ఎండుమిర్చి, నూనె(ఒకటిన్నర టేబుల్ స్పూన్ -) కడాయిలో నూనె వేసి పై దినుసులు పదార్థాలు వేసి, వేయించి, చల్లారాక ముద్దగా నూరి పక్కన పెట్టుకోవాలి. ,సిద్ధం చేసుకున్న మసాలా ముద్ద వేసి కలపాలి.
దీంట్లో ఉడికించిన చికెన్ లేదా మటన్ వేసి కలపాలి. సన్నని మంట మీద ముక్క పూర్తిగా ఉడికాక, ధనియాల పొడి వేసి కలిపి, అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకొని, కొత్తిమీర చల్లి దించాలి.
No comments:
Post a Comment