VTStyles

Recent Post

Tuesday, 17 May 2016

Curry - Pumpkin Paapad RawJackFruit Curry

పనసపొట్టు


పనసపొట్టు - పావుకేజీ పల్లీలు - రెండు చెంచాలు జీలకర్ర ఆవాలు మినప్పప్పు సెనగపప్పు - చెంచా చొప్పున ఎండుమిర్చి పచ్చిమిర్చి - నాలుగు చొప్పున ఇంగువ - కొద్దిగా ఉప్పు - తగినంత కరివేపాకు రెబ్బలు - రెండు నూనె - అరకప్పు గుమ్మడి వడియాలు - కప్పు చింతపండు గుజ్జు - రెండు చెంచాలు.

  • పనసపొట్టును రెండుసార్లు కడిగి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అందులో గ్లాసు నీళ్లూ, కొద్దిగా పసుపూ, ఉప్పూ వేసి పొయ్యి మీద పెట్టి పది నిమిషాలు ఉడికించాలి.

  • తరవాత నీళ్లు వంపేసి పనసపొట్టును గట్టిగా పిండి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి ఆవాలూ, జీలకర్రా, పల్లీలూ, మినప్పప్పూ, సెనగపప్పూ, ఎండుమిర్చీ వేసి వేయించుకోవాలి.

  • అన్నీ వేగాక పచ్చిమిర్చీ, కరివేపాకూ, ఇంగువా వేసేయాలి. నిమిషం తరవాత చింతపండు గుజ్జూ, ఉడికించి పెట్టుకున్న పనసపొట్టూ, మరికొంచెం ఉప్పూ వేసి మంట తగ్గించాలి.

  • ఇది కూరలా తయారయ్యేలోగా మరో బాణలిలో మిగిలిన నూనెను తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. అందులో గుమ్మడి వడియాలను వేయించి, తీసుకోవాలి. కూర మొత్తం తయారయ్యాక వేయించుకున్న వడియాలను అందులో వేసి బాగా కలపాలి. రెండు నిమిషాల తరవాత దింపేయాలి.

No comments:

Post a Comment