ద్రాక్ష రసగుల్లా |
సన్నటి ముక్కలుగా కోసుకున్న ఆకుపచ్చ ద్రాక్షలు - ఒక కప్పు యాపిల్ ముక్కలు - కొన్ని అరటిపండు ముక్కలు - కొన్ని వెనిల్లా ఎసెన్స్ - అర టీస్పూన్ మిల్క్‌మెయిడ్ - నాలుగు టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము - ఒక కప మిల్క్‌బ్రెడ్ - ఆరు ముక్కలు పంచదార పొడి - ఒక టేబుల్ స్పూన్ టూటిఫ్రూటి జీడిపప - తగినన్ని.
బ్రెడ్ ముక్కల అంచులు కట్ చేసి తీసేయాలి. తరువాత ఒక గిన్నెలో ఆకుపచ్చ ద్రాక్షలు, యాపిల్, అరటిపండ్ల ముక్కలు, టూటిఫ్రూటీ, జీడిపప, వెనిల్లా ఎసెన్స్, పంచదార పొడి వేసి కలపాలి.
రెండు స్పూన్ల ఈ మిశ్రమాన్ని తీసుకుని ఒక బ్రెడ్ ముక్కపైన పెట్టి ఉండలా చుట్టాలి.
ఈ ఉండల్ని మొదట మిల్క్‌మెయిడ్‌లో తరువాత కొబ్బరి పొడిలో దొర్లించాలి. అంతే ద్రాక్ష రసగుల్లా సిద్ధం. ఈ రసగుల్లాల పైన ఒక గ్రేప్ పెట్టి అలంకరించండి. చూస్తుంటేనే తినేయబుద్ధి అవుతుంది.
No comments:
Post a Comment