![]() |
మరి కొన్ని కూర రుచులు |
సలహాలు & సూచనలు |
మరి కొన్నమాంసం కూర రుచులు |
కావలసిన పదార్థాలు
*పచ్చి అరటికాయలు: రెండు
* అల్లంవెల్లుల్లి: టీస్పూను
* ఉల్లిపాయలు: రెండు
* పచ్చిమిర్చి: నాలుగు
* కొత్తిమీర: 2 కట్టలు
* ఉప్పు: తగినంత
* పసుపు: పావుటీస్పూను
* నూనె: వేయించడానికి సరిపడా
కడీ తయారీకోసం
*పెరుగు: అరలీటరు
* సెనగపిండి: 3 టేబుల్‌స్పూన్లు
* జీలకర్ర: అరటీస్పూను
* అల్లం: చిన్నముక్క
* పచ్చిమిర్చి: 5
* కారం: టీస్పూను
* దనియాలపొడి: టీస్పూను
* పసుపు: పావుటీస్పూను
* కొబ్బరిచిప్ప: ఒకటి
* కరివేపాకు: కట్ట
* ఆవాలు: అరటీస్పూను
* ఎండుమిర్చి: నాలుగు
* నూనె: తగినంత
* ఉప్పు: సరిపడా
తయారుచేయు విధానం
అరటికాయల్ని ఉడికించి పై చెక్కుని తీసేసి, ముద్దలా చేయాలి.
బాణలిలో నూనె వేసి ఉల్లిముక్కలు, అల్లంవెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా వేయించాక అరటిముద్దను వేసి కలపాలి.తరవాత పసుపు, ఉప్పు, కొత్తిమీర చేర్చి దించి గుండ్రని ఉండలుగా చేసి నూనెలో వేయించి తీయాలి.
ఓ గిన్నెలో పెరుగు వేసి బాగా కలిపి మూడు గ్లాసుల నీళ్లు పోయాలి. అందులోనే దంచిన అల్లం, పచ్చిమిర్చి, దనియాలపొడి, మిగిలినవన్నీ వేసి కలిపి స్టవ్‌మీద పెట్టి ఉడికించాలి.
తరవాత చల్లని నీళ్లలో కలిపిన సెనగపిండి మిశ్రమం కూడా చేర్చి అది చిక్కగా అవుతుండగా కొబ్బరి తురుము వేసి ఉడికించాలి.
ఇప్పుడు విడిగా ఓ గిన్నెలో తాలింపు వేసి కడీలో కలపాలి. తరవాత అందులోనే అరటి కోఫ్తాలను వేసి ఐదు నిమిషాలు ఉడికించి ఉప్పు రుచి చూసి దించాలి.
No comments:
Post a Comment