![]() |
మరి కొన్ని సలాడ్స్ రుచులు |
కావలసిన పదార్థాలు
*ఫ్రెష్ క్రీం- 1 కప్పు
* రకరకాల పండ్ల ముక్కలు- 3 కప్పులు
* పంచదార- 1/2 టీ స్పూను
* మిరియాల పొడి- 1/4 టీ స్పూను
* ఉప్పు- 1/4 టీ స్పూను
* చాట్ మసాల- 1/4 టీ స్పూను
తయారుచేయు విధానం
పండ్ల ముక్కల్లో ఉప్పు, మిరియాలపొడి, చాట్ మసాల వేసి బాగా కలపాలి.
తరువాత ఒక గిన్నెలో క్రీం వేసి దానిని మరుగుతున్న నీళ్ళు ఉన్న గిన్నెలో పెట్టి వేడిచేయాలి.
ఆ తరువాత క్రీంలో పంచదార వేసి బాగా కలిపి అది కరిగిన తరువాత దింపేయాలి.
. ఈ క్రీంను కాస్త వెచ్చగా ఉండగానే పండ్ల ముక్కలపై వేసుకుని తినాలి.
No comments:
Post a Comment