VTStyles

Recent Post

Friday, 6 May 2016

Curry - Veg - Snake Gourd Mustard Curry

సొరకాయ ఆవ కూర


సొరకాయ ముక్కలు - రెండు కప్పులు ఉప్పు - తగినంత పచ్చిమిర్చి - మూడు ఆవాలు - రెండు చెంచాలు మినప్పప్పు సెనగపప్పు - పావు చెంచా చొప్పున కరివేపాకు రెబ్బలు - రెండు ఎండుమిర్చి - రెండు చింతపండు - నిమ్మకాయంత సైజులో పసుపు - చిటికెడు ఇంగువ - చిటికెడు.

  • సొరకాయ ముక్కల్లో కొద్దిగా ఉప్పూ, పసుపూ వేసి అవి మునిగేదాకా నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టి ఉడికించుకోవాలి.

  • ముక్కలు ఉడికాక దానిలోని నీళ్లను వంపేయాలి. మరోపక్క చింతపండు గుజ్జు తీసి పెట్టుకోవాలి. చెంచా ఆవాలను విడిగా మిక్సీ జారులోకి తీసుకుని మెత్తగా చేసుకోవాలి.

  • ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి మినప్పప్పూ, సెనగపప్పూ, మిగిలిన ఆవాలూ, ఎండుమిర్చీ, ఇంగువా, కరివేపాకు రెబ్బలు వేసి వేయించుకోవాలి. తాలింపు వేగాక పచ్చిమిర్చి ముక్కలూ, చింతపండు గుజ్జూ వేయాలి.

  • రెండు నిమిషాల తరవాత ముందుగా ఉడికించి పెట్టుకున్న సొరకాయ ముక్కలూ, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి దింపేయాలి. ఆవాల మిశ్రమాన్ని వేసి ఓసారి కలిపి మూత పెట్టేస్తే సరిపోతుంది.

No comments:

Post a Comment