![]() |
మరి కొన్ని కూర రుచులు |
సలహాలు & సూచనలు |
మరి కొన్నమాంసం కూర రుచులు |
కావలసిన పదార్థాలు
* సొరకాయ ముక్కలు - కప్పు
* కొబ్బరి తురుము - అరకప్పు
* జీలకర్ర - చెంచా
* పచ్చిమిర్చి - నాలుగు
* నూనె - రెండు చెంచాలు
* పసుపు - అరచెంచా
* మజ్జిగ - ఒకటిన్నర కప్పు
* ఉప్పు - తగినంత
* ఆవాలు - అరచెంచా
* ఎండుమిర్చి - ఒకటి
* మెంతులు - పావుచెంచా.
తయారుచేయు విధానం
మిక్సీ జారులోకి కొబ్బరి తురుమూ, జీలకర్రా, పచ్చిమిర్చీ తీసుకుని మెత్తని ముద్దలా చేసుకుని పెట్టుకోవాలి.
ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి ఆవాలూ, ఎండుమిర్చీ, మెంతులూ వేయించుకోవాలి. తరవాత అందులో సొరకాయ ముక్కలూ, పసుపూ వేసి కలిపి, కాసిని నీళ్లు చల్లి మూత పెట్టేయాలి.
కాసేపటికి సొరకాయ ముక్కలు ఉడుకుతాయి. అప్పుడు ముందుగా చేసుకున్న కొబ్బరి ముద్దా, తగినంత ఉప్పూ, మజ్జిగ వేసి మంట తగ్గించాలి. అన్నింటినీ కలిపి.. రెండు నిమిషాలయ్యాక దింపేస్తే చాలు.
No comments:
Post a Comment