![]() |
మరి కొన్ని కూర రుచులు |
సలహాలు & సూచనలు |
మరి కొన్నమాంసం కూర రుచులు |
కావలసిన పదార్థాలు
* సొరకాయ ముక్కలు - కప్పు
* నువ్వులు - నాలుగు చెంచాలు
* కొబ్బరి తురుము - నాలుగు చెంచాలు
* పచ్చిమిర్చి - నాలుగు
* వెల్లుల్లి రెబ్బలు - రెండు
* నూనె - రెండు టేబుల్‌స్పూన్లు
* తాలింపు గింజలు - చెంచా
* ఉప్పు - తగినంత
* ఎండుమిర్చి - ఒకటి
* కరివేపాకు రెబ్బలు - రెండు.
తయారుచేయు విధానం
ఓ గిన్నెలో సగం వరకూ నీళ్లు తీసుకుని అందులో సొరకాయ ముక్కలు వేసి పొయ్యిమీద పెట్టాలి. అవి ఉడికాయనుకున్నాక దింపి నీటిని వంపేయాలి.
అవి ఉడికాయనుకున్నాక దింపి నీటిని వంపేయాలి. బాణలిలో నువ్వుల్ని నూనె లేకుండా వేయించుకుని తీసుకోవాలి. వేడి చల్లారాక నువ్వులూ, కొబ్బరి తురుమూ, పచ్చిమిర్చీ, వెల్లుల్లి రెబ్బలూ మిక్సీ జారులోకి తీసుకుని మెత్తగా చేసుకోవాలి.
ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి తాలింపు గింజలూ, ఎండుమిర్చీ, కరివేపాకు రెబ్బలు వేయించుకోవాలి. తరవాత ముందుగా ఉడికించుకున్న సొరకాయ ముక్కలూ, నువ్వుల మసాలా, తగినంత ఉప్పూ వేసి బాగా కలపాలి.
మసాలా ముక్కలకు పట్టాక దింపేయాలి. ఇది చపాతీల్లోకి బాగుంటుంది.
No comments:
Post a Comment