![]() |
మరి కొన్ని కూర రుచులు |
సలహాలు & సూచనలు |
మరి కొన్నమాంసం కూర రుచులు |
కావలసిన పదార్థాలు
*సొరకాయ
* చిలగడదుంప ముక్కలు - కప్పు చొప్పున
* చింతపండు రసం - రెండు టేబుల్‌స్పూన్లు
* బెల్లం తరుగు - రెండు చెంచాలు
* కారం - అరచెంచా
* ఉప్పు - తగినంత
* బియ్యప్పిండి - రెండు చెంచాలు
* మినప్పప్పు - చెంచా
* ధనియాలు
* జీలకర్ర - చెంచా చొప్పున
* ఆవాలు - అరచెంచా
* ఎండుమిర్చి - రెండు
* ఇంగువ - చిటికెడు
* నూనె - రెండు చెంచాలు.
తయారుచేయు విధానం
ఓ గిన్నెలో సగం వరకూ నీళ్లు తీసుకుని అందులో సొరకాయ, చిలగడదుంప ముక్కల్ని వేసి పొయ్యిమీద పెట్టాలి. ఈ ముక్కలు ఉడికాయనుకున్నాక చింతపండు రసం వేసుకోవాలి.
ఇందులో తగినంత ఉప్పూ, బెల్లం తరుగు వేయాలి. అరకప్పు నీటిలో బియ్యప్పిండీ, కారం, ఇంగువా వేసి కలిపి ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న పులుసులో వేసి మంట తగ్గించేయాలి.
ఇప్పుడు బాణలిలో ధనియాలూ, ఎండుమిర్చీ, సగం చొప్పున జీలకర్రా, మినప్పప్పూ వేయించుకుని దింపేయాలి.
వేడి చల్లారాక వీటన్నింటినీ మిక్సీ జారులోకి తీసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇందులోంచి చెంచా పొడిని మాత్రమే పులుసులో వేసుకోవాలి.
బాణలిలో నూనె వేడిచేసి మిగిలిన మినప్పప్పూ, జీలకర్రా, ఆవాలు వేయించి ఈ పులుసుపై వేస్తే సరిపోతుంది.
No comments:
Post a Comment