VTStyles

Recent Post

Wednesday, 25 May 2016

Parata - Chandal Parata/Sengala Parata

చనా పరోటా


గోధుమ పిండి- ఒకటిన్నర కప్పు నూనె- 3 టేబుల్‌ స్పూన్లు ఉప్పు- రుచికి సరిపడా నానబెట్టిన తెల్ల శెనగలు- 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు- 1/2 కప్పు పచ్చిమిర్చి- 4 అల్లం తరుగు- 1/4 టీ స్పూను కొత్తిమీర కరివేపాకు తరుగు- ఒక్కోటి 1/2 టీ స్పూను చొప్పున కారం- 1/2 టీ స్పూను గరంమసాల- 1/2 టీ స్పూను పసుపు- చిటికెడు.

  • గోధుమ పిండిలో ఉప్పు, రెండు టీ స్పూన్ల నూనె వేసి, సరిపడా నీళ్ళతో చపాతీ పిండి కలుపుకోవాలి. దానికి నూనె పట్టించి ఒక గంట సేపు నాననివ్వాలి.

  • తరువాత శెనగలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం తరుగులను మిక్సీలో వేసి కొద్దిగా నీళ్ళు చిలకరించి బరకగా ముద్ద చేయాలి.

  • తరువాత ఒక కడాయిలో టేబుల్‌ స్పూను నూనె వేసి ఉల్లిపాయ ముక్కలను దోరగా వేగించుకోవాలి. ఆ తరువాత శెనగల ముద్ద వేసి పచ్చివాసన పోయేవరకూ వేగించి, కారం, పసుపు, గరం మసాల జల్లి మరో రెండు నిమిషాలు వేగించి దించేయాలి.

  • తరువాత నిమ్మకాయ పరిమాణంలో చపాతీ పిండి తీసుకుని, దాని మధ్యలో ఉసిరికాయంత శెనగల మిశ్రమాన్ని పెట్టి మూసేసి, చపాతీలు ఒత్తుకోవాలి. ఈ చపాతీలను రెండు వైపులా నూనె వేస్తూ దోరగా వేగించుకోవాలి.

No comments:

Post a Comment