VTStyles

Recent Post

Wednesday, 25 May 2016

Parata - Egg Parata / Guddu Parata

ఎగ్‌ పరాటా


గుడ్డు -1 (రెండు పరాటాలకు) గోధుమపిండి/మైదా - 1 కప్పు టమోటో - 1 ఉల్లిపాయ -1 కొత్తిమీర - 1 కట్ట పచ్చిమిర్చి - 1 ఉప్పు - రుచికి సరిపడా కారం - అర టీ స్పూను చాట్‌ మసాలా - అర టీ స్పూను ధనియాలపొడి - అర టీ స్పూను జీరాపొడి - అర టీ స్పూను నూనె - పరాటాలు కాల్చడానికి సరిపడా.

  • పిండిలో సరిపడా నీరు పోసి ముద్దలా చేసుకుని అరగంట నానబెట్టాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటోలను సన్నగా తరగి ఒక పాత్రలో వేసి గుడ్డుతో పాటు మిగతా పొడులు, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా గిలకొట్టి పక్కనుంచాలి.

  • సరిపడా పిండి ముద్దని తీసుకుని గుండ్రంగా రుద్దుకుని, తర్వాత పొడిపిండి కొద్దిగా చల్లుతూ త్రికోణంలా మడతపెట్టి సాగదీయాలి.

  • తర్వాత పెనం పై వేసి సన్నని మంటపై కాలుస్తే ఒక వైపు పొంగుతుంది. పొంగిన వైపు కత్తితో కట్‌ చేసి, అందులో గుడ్డు మిశ్రమాన్ని స్పూనుతో పలచగా రుద్ది, అంచును ఒత్తాలి.

  • తర్వాత గుడ్డు పచ్చివాసన పోయేదాకా రెండువైపులా కాల్చుకోవాలి. ఈ పరాటాలు వేడివేడిగా రైతాతో తింటే చాలా రుచిగా ఉంటాయి.

No comments:

Post a Comment