మెంతి పరోటా |
గోధుమపిండి - 1 కప్పు శనగపిండి - 1 కప్పు మెంతి తరుగు - 1 కప్పు జీరాపొడి దనియాల పొడులు - 1 టీ స్పూను చొప్పున పసుపు - చిటికెడు కారం - అర టీ స్పూను పచ్చిమిర్చి అల్లం పేస్టు - 1 టీ స్పూను పెరుగు - 2 టేబుల్ స్పూన్లు ఉప్పు - రుచికి తగినంత నూనె - కాల్చడానికి సరిపడా .
పెరుగు తప్పించి మిగతా పదార్థాలన్నీ ఒక పాత్రలో వేసుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె చేర్చి బాగా కలుపుకోవాలి.
. మరీ గట్టిగా అనిపిస్తే పెరుగుతో ముద్దలా చేసుకుని తడిగుడ్డ కప్పి అరగంట పక్కనుంచాలి.
తర్వాత పరాటాలు చేసుకుని రెండువైపులా నూనె రాసి, దోరగా కాల్చుకోవాలి. మీకిష్టమైన చట్నీతో వేడివేడిగా తినండి, చాలా బాగుంటాయి.
No comments:
Post a Comment