మొఘలాయ్ పరాటా |
రెండు కప్పు మైదా మూడు టేబుల్‌స్పూన్ల నెయ్యి నాలుగు గుడ్లు వేగించడానికి నూనె సరిపడినంత ఉప్పు
స్టఫింగ్‌కు కావలసినవి:
పనీర్ (నలిపి) 300 గ్రాములు సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి కరివేపాకు రెబ్బలు పది తురిమిన కొబ్బరి అరకప్పు నూనె మూడు టేబుల్‌స్పూన్లు పసుపు అర టీస్పూను జీలకర్ర పొడి ఒక టీస్పూను తరిగిన పచ్చిమిరపకాయలు రెండు ఉప్పు సరిపడినంత.
నూనె వేడిచేసి ఉల్లిపాయ ముక్కలను కొద్దిగా వేగించాలి. తరువాత కరివేపాకు వేసి కొన్ని సెకన్ల పాటు వేగించాలి. సెగ తగ్గించి స్టఫింగ్‌కు వాడే మిగతా పదార్థాలను వేయాలి.
సన్నని సెగమీద మూడు నిముషాలు ఉంచి తరువాత సెగ పెంచి మరో మూడు నిముషాలు ఉంచాలి. తరువాత దీన్ని దించి పక్కన పెట్టుకోవాలి.
పరాఠాలకు ఉపయోగించే పదార్ధాలన్నింటినీ కలిపి ముద్దగా చేసి ఆరు భాగాలు చేయాలి. ఒక్కో భాగాన్ని గుండ్రంగా వత్తాలి. పెద్ద పెనం తీసుకుని దానిపై కనీసం రెండు కప్పుల నూనె పోసి వేడిచేయాలి.
తరువాత గుడ్లను పగలకొట్టి కొంత సొనను పోసి పరాఠాను దానిపై వేయూలి. ఇందులో కొంచెం ఫిల్లింగ్‌ను ఉంచి మూసేసి సన్నని సెగపై నాలుగు నిముషాలు ఉంచాలి. చివర్లు మూసేప్పుడు స్క్వేర్ ఆకారం వచ్చేలా చూసుకోవాలి.
.నెమ్మదిగా పరాఠాను తిప్పి రెండోపక్క కూడా సన్నని సెగమీదే బ్రౌన్ రంగు వచ్చే వరకు కాల్చాలి. వీటిని వేడిగా మీకు నచ్చిన చట్నీతో తింటే రుచిగా ఉంటాయి.
No comments:
Post a Comment