VTStyles

Recent Post

Wednesday, 25 May 2016

Parata - Radish Parata / Mool Chapati / Mullangi Roti

రాడిష్‌ పరాటాలు


రాడిష్‌ తరుగు - 2 కప్పులు ఉల్లిపాయ (తరుగు) - 1 అల్లం తరుగు - 1 టీ స్పూను పచ్చిమిర్చి తరుగు - 2 టీ స్పూన్లు గోధుమపిండి - 2 కప్పులు పసుపు - పావు టీ స్పూను కొత్తిమీర తరుగు - గుప్పెడు ఉప్పు - రుచికి తగినంత నూనె - వేగించడానికి సరిపడా.

  • కడాయిలో కొద్దిగా నూనె వేసి ఉల్లి, అల్లం, పచ్చిమిర్చి తరుగు వేగాక రాడిష్‌ తరుగు, ఉప్పు, పసుపు వేసి మెత్తబడేదాక సన్నని మంటపై వేగించాలి. కొద్దిగా నీరున్నప్పుడే కొత్తిమీర కలిపి దించేసి చల్లారనివ్వాలి.

  • పిండిలో ఒక టేబుల్‌ స్పూను నూనెతో పాటు రాడిష్‌ మిశ్రమం కొద్దికొద్దిగా వేస్తూ ముద్దలా తయారుచేసి అరగంట పక్కనుంచాలి.

  • సమాన భాగాలుగా ఉండలు చేసి పరాటాలు చేసుకుని రెండువైపులా నూనెతో దోరగా కాల్చుకోవాలి. రైతాతో ఈ పరాటాలు ఎంతో బాగుంటాయి.

No comments:

Post a Comment