వెలగపండు పులిహోర |
వెలగపండు - 1 (పొడి) అన్నం - 2 కప్పులు వేరుశనగపప్పు - 1 టేబుల్ స్పూను శనగపప్పు మినప్పప్పు ఆవాలు - 1 టీ స్పూను చొప్పున పసుపు - అర టీ స్పూను పచ్చిమిర్చి - 3 ఎండుమిర్చి - 3 కరివేపాకు - 4 రెబ్బలు ఇంగువ - చిటికెడు నూనె - 2 టేబుల్ స్పూన్లు ఉప్పు - రుచికి తగినంత.
వెలక్కాయ గుజ్జులో కొద్దినీళ్లు పోసి 5 నిమిషాలు ఉడికించి, చల్లారిన తర్వాత పేస్టు చేసుకోవాలి.
నూనెలో ఆవాలు, వేరుశనగ, మినప, శనగపప్పులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, ఇంగువ, పసుపు ఒకటి తర్వాత ఒకటి వేసి వేగించాలి.
ఇప్పుడు వెలక్కాయ పేస్టు కూడా కలిపి రెండు నిమిషాలు ఉంచి స్టౌవ్ కట్టేయాలి. తర్వాత అన్నం, ఉప్పు కలపాలి. చింతపండు, నిమ్మకాయ పులిహోర కంటే భిన్నమైన రుచిగల పులిహోర ఇది.
Hi,
ReplyDeleteToday i.e.29/08/2017 morning tried velapandu pulihora as prasadam at our home.
Whole family happy with new pulihora.
Thanks a lot.
SRINIVAS
Great...I am so happy that you loved it.
Delete