ఆలు బూందీ పచ్చడి |
ఆలుగడ్డలు - రెండు బూందీ - పావు కప్పు పెరుగు - రెండు కప్పులు కొత్తిమీర తురుము - కొద్దిగా ధనియాల పొడి - ఒక టీ స్పూను కారం - అర టీ స్పూను ఉప్పు - తగినంత నూనె - సరిపడా.
ముందుగా ఆలుగడ్డల్ని ముక్కలు కోసి ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికాక పొట్టు తీసి చిదుముకుని పక్కన పెట్టుకోవాలి.
పొయ్యి మీద గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి కాగాక ఆలు ముద్ద వేయాలి. ధనియాల పొడి, కారం, ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. పచ్చివాసన పోయాక దించేయాలి.
బాగా చల్లారాక పెరుగు వేసి కలపాలి. చివర్లో బూందీ వేసుకోవాలి. దీన్ని అన్నంతో కాకుండా స్నాక్‌లా కూడా తినొచ్చు.
No comments:
Post a Comment