VTStyles

Recent Post

Showing posts with label CommonMeal_Raita. Show all posts
Showing posts with label CommonMeal_Raita. Show all posts

Wednesday, 15 June 2016

Raita - Capsicum Raita

కాప్సికం రైతా


పెరుగు - 3 కప్పులు దోసకాయ -1 కాప్సికం - 2 ఉప్పు - రుచికి తగినంత కొత్తిమీర - 2 టేబుల్‌ స్పూన్లు నూనె - కొద్దిగా.

  • కాప్సికం, దోసకాయని సన్నగా తరిగిపెట్టుకోవాలి. కాప్సికంని మాత్రమే నూనెలో కాసేపు వేగనిచ్చి తీసేయాలి.

  • తర్వాత పెరుగులో ఉప్పు, దోస ముక్కలు, వేగిన కాప్సికం, కొత్తిమీరను వేసి బాగా కలపాలి. ఈ రైతా బిర్యాని, పరాటా, చపాతీల్లో దేన్లోకైనా బాగుంటుంది.

Raita - Potato Raita

ఆలూ రైతా


ఆలు - 2 పెరుగు - 2 కప్పులు పచ్చిమిర్చి - 2 వెల్లుల్లి - 2 రేకలు జీరాపొడి - అర టీ స్పూను పుదీనా ఆకులు - 1 టేబుల్‌ స్పూను ఉప్పు - రుచికి తగినంత.

  • ముందుగా ఆలుగడ్డల్ని మెత్తగా ఉడికించి తొక్కతీసి మెదిపి పెట్టుకోవాలి.

  • పచ్చిమిర్చి, పుదీనా, వెల్లుల్లి గ్రైండు చేసుకోవాలి. తర్వాత పెరుగులో మెదిపిన ఆలు గుజ్జు, పుదీనా మిశ్రమం, జీరాపొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.

  • ఈ రైతా పరాటాల్లోకి, అన్నంలోకి బాగుంటుంది.

Raita - Pumpkin / Gummadi kaya Raita

గుమ్మడి రైతా


గుమ్మడికాయ ముక్కలు - 2 కప్పులు పచ్చిమిర్చి - 2 పచ్చికొబ్బరి ముక్కలు - అరకప్పు పెరుగు - 3 కప్పులు ఉప్పు - రుచికి తగినంత పుట్నాలు - 1 టేబుల్‌ స్పూను నూనె - 2 టీ స్పూన్లు శనగపప్పు - 1 టీ స్పూను మినప్పప్పు - 1 టీ స్పూను పసుపు - అర టీ స్పూను కరివేపాకు - 4 రెబ్బలు ఆవాలు - అర టీ స్పూను.

  • గుమ్మడి ముక్కల్ని మరీ మెత్తగా కాకుండా ఉడికించుకోవాలి. పచ్చిమిర్చి, పుట్నాలు, కొబ్బరి గ్రైండ్‌ చేసుకోవాలి.

  • కొబ్బరి మిశ్రమం, ఉడికించిన గుమ్మడి ముక్కలు, ఉప్పు పెరుగులో వేసి కలపాలి. తర్వాత కడాయిలో నూనె వేసి మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, పసుపు, కరివేపాకులతో తాలింపు పెట్టి పెరుగు మిశ్రమంలో కలపాలి. ఈ రైతా బ్రెడ్‌తో చాలా బాగుంటుంది.

Raita - Radish/ Mullangi/ Mool Raita

ముల్లంగి రైతా


ముల్లంగి - 2 టమేటో -1 ఉల్లిపాయ తరుగు - 2 టేబుల్‌ స్పూన్లు ఉప్పు - రుచికి తగినంత పెరుగు - 3 కప్పులు ఎండుమిర్చి - 2 జీరాపొడి - అర టీ స్పూను జీలకర్ర - అర టీ స్పూను.

  • టమేటో, ఉల్లిపాయల్ని సన్నగా తరగాలి. ముల్లంగిని మాత్రం తురుముకోవాలి. పెరుగులో ఈ ముక్కలు, ఉప్పు వేసి కలపాలి.

  • తర్వాత కడాయిలో నూనె వేసి ఎండుమిర్చి, జీలకర్ర, జీరాపొడితో తాలింపు పెట్టి పెరుగు మిశ్రమంలో కలపాలి. ఈ రైతా చపాతీల్లోకి బాగుంటుంది.

Sunday, 15 May 2016

Raita - Aloo Boondi Raita

ఆలు బూందీ పచ్చడి


ఆలుగడ్డలు - రెండు బూందీ - పావు కప్పు పెరుగు - రెండు కప్పులు కొత్తిమీర తురుము - కొద్దిగా ధనియాల పొడి - ఒక టీ స్పూను కారం - అర టీ స్పూను ఉప్పు - తగినంత నూనె - సరిపడా.

  • ముందుగా ఆలుగడ్డల్ని ముక్కలు కోసి ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికాక పొట్టు తీసి చిదుముకుని పక్కన పెట్టుకోవాలి.

  • పొయ్యి మీద గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి కాగాక ఆలు ముద్ద వేయాలి. ధనియాల పొడి, కారం, ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. పచ్చివాసన పోయాక దించేయాలి.

  • బాగా చల్లారాక పెరుగు వేసి కలపాలి. చివర్లో బూందీ వేసుకోవాలి. దీన్ని అన్నంతో కాకుండా స్నాక్‌లా కూడా తినొచ్చు.

Raita - Tamarind Leaf Raita

చింతచిగురు పెరుగు పచ్చడి


పెరుగు - 200 గ్రా కొబ్బరి తురుము - 100 గ్రా ఉప్పు - తగినంత పచ్చి శనగపప్పు - 10 గ్రా మినప్పప్పు - 10 గ్రా ఆవాలు - టీస్పూను కరివేపాకు - రెండు రెమ్మలు చింతచిగురు - 20 గ్రా మిరప్పొడి - 10 గ్రా ఎండుమిర్చి - 5గ్రా నూనె - టీ స్పూన్.

  • పెరుగులో ఉప్పు, కొబ్బరి తురుము కలపాలి.

  • బాణలిలో నూనె వేడిచేసి ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మిన ప్పప్పు, కరివేపాకు వరుసగా వేసి వేగిన తరువాత చివరగా చింతచిగురు, మిరప్పొడి వేయాలి.

  • చింతచిగురు మెత్తబడ్డాక దించేసి, పెరుగు మిశ్రమంలో కలపాలి. అంతే, పెరుగు పచ్చడి రెడీ!

Friday, 6 May 2016

Raita - Snakegourd Milk Raita

సొరకాయ రైతా


చిక్కని పెరుగు - కప్పు పాలు - అరకప్పు సొరకాయ తురుము - కప్పు నూనె - రెండు చెంచాలు జీలకర్ర - చెంచా ఇంగువ - చిటికెడు ఎండుమిర్చి - రెండు అల్లం తరుగు - చెంచా కొత్తిమీర - కట్ట (సన్నగా తరగాలి) ఉప్పు - తగినంత.

  • పెరుగూ, పాలూ ఓ గిన్నెలో తీసుకుని క్రీంలా అయ్యేవరకూ గిలకొట్టి పెట్టుకోవాలి.

  • ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి జీలకర్రా, ఇంగువా, ఎండుమిర్చీ వేయించుకోవాలి. రెండు నిమిషాల తరవాత సొరకాయ తురుమూ, అల్లం, కొత్తిమీర తరుగూ, సరిపడా ఉప్పూ వేసి వేయించి మూత పెట్టేయాలి.

  • ఐదారు నిమిషాలకు సొరకాయ తురుములోని పచ్చివాసన పోయి, కూరలా దగ్గరకు అవుతుంది. అప్పుడు దింపేయాలి. ఇది బాగా చల్లారాక పెరుగులో వేసి కలిపితే చాలు.

Raita - Mint Raita

పుదీనా రైతా


కొత్తిమీర - కట్ట పుదీనా - కట్ట చిక్కటి పెరుగు - కప్పు ఉప్పు - తగినంత పచ్చిమిర్చి - రెండు వేయించిన జీలకర్రపొడి - ముప్పావుచెంచా చాట్‌మసాలా - పావుచెంచా.

  • పుదీనా, కొత్తమీరా, పచ్చిమిర్చీ బాగా కడిగి మిక్సీ జారులోకి తీసుకుని మెత్తని ముద్దలా చేసుకోవాలి. దీన్ని గిలకొట్టిన పెరుగులో వేసి బాగా కలపాలి.

  • తరవాత ఉప్పూ, జీలకర్రపొడీ, చాట్‌మసాలా వేసుకుని బాగా కలిపితే చాలు. పుదీనా రైతా సిద్ధం. దీన్ని బిర్యానీలాంటి వాటితోనే కాదు, చపాతీలతోనూ తినొచ్చు.