![]() |
మరి కొన్ని సాంబారు రుచులు |
కావలసిన పదార్థాలు
*కందిపప్పు: 50 గ్రా.
* చింతపండు: పెద్ద నిమ్మకాయంత
* టొమాటోలు: రెండు (మీడియంసైజువి)
* కొత్తిమీర: ఒక కట్ట
* కరివేపాకు: 5 రెబ్బలు
రసం పొడికోసం: దనియాలు: 3 టీస్పూన్లు
* మిరియాలు: అరటీస్పూను
* ఇంగువ: చిటికెడు
* జీలకర్ర: పావు టీస్పూను
* ఎండుమిర్చి: నాలుగు
* సెనగపప్పు: 3 టీస్పూన్లు
* తాలింపుకోసం: నూనె
* ఆవాలు
* ఎండుమిర్చి
* జీలకర్ర
* కరివేపాకు: కొద్దికొద్దిగా
తయారుచేయు విధానం
కందిపప్పుని ఉడికించి మెత్తగా మెదపాలి. చింతపండు నానబెట్టి గుజ్జు తీసి అందులో ఓ గ్లాసు నీళ్లు పోసి మరిగించాలి.
ఓ గిన్నెలో ఉడికించిన పప్పు, మరిగించిన చింతపండు రసం కలిపి చిన్నగా తరిగిన టొమాటో ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసి కలపాలి.
పొడి కోసం తీసుకున్నవన్నీ వేయించి పొడి చేసి రసంలో కలపాలి. ఇప్పుడు ఇందులో సుమారు రెండుపావు లీటర్ల నీళ్లు పోసి సన్నని సెగమీద మరిగించాలి. అది బాగా మరిగిన తరవాత తాలింపు చేసి దించాలి.
No comments:
Post a Comment