![]() |
మరి కొన్ని సాంబారు రుచులు |
కావలసిన పదార్థాలు
*పచ్చి మామిడికాయలు: రెండు
* ఉల్లిపాయ: ఒకటి
* పచ్చిమిర్చి: నాలుగు
* అల్లంవెల్లుల్లి: టీస్పూను
* కరివేపాకు: 2 రెబ్బలు
* జీలకర్ర: పావుటీస్పూను
* ఆవాలు: పావుటీస్పూను
* ఎండుమిర్చి: మూడు
* నూనె: 2 టీస్పూన్లు
* ఉప్పు: తగినంత
* పసుపు: పావుటీస్పూను
తయారుచేయు విధానం
పచ్చిమామిడికాయల్ని నీళ్లలో వేసి ఉడికించాలి. వాటి నుంచి గుజ్జుతీసి అందులో సుమారు లీటరు నీళ్లు కలిపి పక్కన ఉంచాలి.
పాన్‌లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేగాక అల్లంవెల్లుల్లి కూడా వేసి బాగా వేయించాలి.
ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పసుపు కూడా వేసి వేగాక తీసి ఉంచిన మామిడిరసంలో కలపాలి. చివరగా చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు వేసి కలిపి వడ్డించాలి.
No comments:
Post a Comment