మైసూర్ రసం |
కందిపప్పు: 3 టేబుల్ స్పూన్లు చింతపండు: రెండు మీడియం సైజు నిమ్మకాయలంత టొమాటోలు: నాలుగు కొత్తిమీర: కట్ట కొబ్బరి తురుము: 4 టేబుల్ స్పూన్లు ఉప్పు: సరిపడా పొడికోసం: దనియాలు: 3 టీస్పూన్లు ఆవాలు: అరటీస్పూను జీలకర్ర: టీస్పూను మెంతులు: టీస్పూను ఎండుమిర్చి: నాలుగు కరివేపాకు: 6 రెబ్బలు మిరియాలు: అరటీస్పూను తాలింపుకోసం జీలకర్ర ఆవాలు ఇంగువ ఎండుమిర్చి కరివేపాకు నూనె: కొద్దికొద్దిగా
ముందుగా బాణలిలో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేయించి తీసి చల్లారనివ్వాలి. అదే బాణలిలో టీస్పూను నూనె వేసి ఎండుమిర్చి, మిరియాలు, కరివేపాకు, ఇంగువ వేసి వేగాక చల్లారనివ్వాలి. ఇప్పుడు అన్నీ కలిపి మెత్తగా పొడి చేయాలి.
కందిపప్పును అన్నం వండేటప్పుడే ఉడికించి ఉంచాలి.
చింతపండును నానబెట్టి మొత్తం ఒకటిన్నర లీటర్ల రసం తీయాలి. ఈ రసాన్ని ఓ మందపాటి బాణలిలో పోసి మరిగించాలి.
అందులో ఉడికించి మెదిపిన కందిపప్పు, సన్నగా కోసిన టొమాటోలు, రసం పొడి, కొత్తిమీర, ఉప్పు వేసి పదినిమిషాలు మరిగించాలి.
తరవాత దించి తాలింపు చేసి కొబ్బరి తురుము చల్లి వడ్డించాలి.
No comments:
Post a Comment