VTStyles

Recent Post

Tuesday, 24 May 2016

Snacks - Bajji - Aaloo Mirchi Bajji/Aalugadda Pacchi MIrapa kaya Bajji

ఆలు మిర్చీ బజ్జీ


లావు మిర్చీలు - 5 శనగపిండి - 100గ్రా. ఉప్పు - రుచికి తగినంత వాము - 3 గ్రా. కారం - 5 గ్రా. ఉడికించిన బంగాళదుంపలు -3 ఎండు మామిడిపొడి - 3 గ్రా. జీరాపొడి -3 గ్రా. నూనె - వేగించడానికి సరిపడా.

  • ఉడికించిన బంగాళదుంపల తొక్కతీసి మెదిపి అందులో కారం, జీరాపొడి, మామిడి పొడి వేసి బాగా కలిపి ముద్దలా చేసిపెట్టుకోవాలి.

  • మిర్చీలను నిలువునా మధ్యలోకి చీరి, గింజల్ని తీసేసి అందులో బంగాళదుంప మిశ్రమాన్ని పెట్టాలి. ఇప్పుడు శనగపిండిలో ఉప్పు, వాము వేసి నీటితో చిక్కని జారుగా కలుపుకోవాలి.

  • మిర్చీలను శనగపిండి జారులో ముంచి ఒక మోస్తరు వేడిపై నూనెలో దోరగా వేగించుకోవాలి. వేడివేడి మిర్చీ బజ్జీలు ఎంతో రుచిగా ఉంటాయి. ఇష్టం ఉన్నవారు పుదీనా చట్నీతో తినవచ్చు.

No comments:

Post a Comment