బెండకాయ బజ్జీలు |
(మూడంగుళాల) బెండకాయలు - అరకేజీ శనగపిండి - 1 కప్పు వేగించిన దనియాలు జీలకర్ర పొడులు - 1 టీ స్పూను చొప్పున ఉప్పు - రుచికి తగినంత పసుపు - పావు టీ స్పూను కారం - అర టీ స్పూను ఆమ్ చూర్ పొడి - 1 టీ స్పూను చాట్‌మసాల - 1 టేబుల్ స్పూను నూనె - వేగించడానికి సరిపడా.
తొడిమలు (మాత్రమే) తీసిన బెండకాయల్ని నిలువుగా చీల్చి నీడలో గంటపాటు ఆరబెట్టాలి.
ఒక పాత్రలో శనగపిండి, కారం, ఉప్పు, దనియా, జీరా, ఆమ్ చూర్ పొడులు, ఉప్పు, పసుపు వేసి తగినంత నీటితో జారుగా కలుపుకోవాలి.
ఆరిన బెండ చీలికను జారులో ముంచి నూనెలో దోరగా వేగించాలి. వేడిగా ఉన్నప్పుడే బజ్జీలపై చాట్ మసాల చల్లుకోవాలి. అన్నంతో నంజుకోడానికి బాగుంటాయి.
No comments:
Post a Comment