దొండకాయ బజ్జీ |
దొండకాయలు - పావుకేజి శెనగపిండి - ఒక కప్పు బేకింగ్ సోడా - అర టీస్పూన్ కారం - ఒక టీస్పూన్ ఉప్పు- రుచికి సరిపడా
శెనగపిండి, బేకింగ్‌సోడా, కారం, ఉప్పులను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో నీళ్లు పోసి, ఒక స్పూన్ నూనె కూడా వేసి మెత్తటి పేస్ట్‌లా కలపాలి.
దొండకాయల్ని నిలువుగా రెండు ముక్కలుగా కోయాలి. కళాయిలో నూనె పోసి వేడి చేసి దొండకాయ ముక్కల్ని శెనగపిండి పేస్ట్‌లో ముంచి వేగించాలి. ఎంతో సింపుల్‌గా దొండకాయ బజ్జీలు రెడీ.
No comments:
Post a Comment