మ్యాంగో జెల్లీ కాజూ సందేష్ |
జీడిపప్పు పేస్ట్- 1 కప్పు పంచదార- 3 కప్పులు నెయ్యి- 1 టీ స్పూను మామిడి గుజ్జు- 1 కప్పు నీళ్ళు- 1/4 కప్పు డ్రై ఫ్రూట్స్- 2 టేబుల్ స్పూన్లు .
ఒక బాణలిలో రెండు కప్పుల పంచదార, జీడిపప్పు పేస్ట్ వేసి బాగా కలిపి సన్నని మంట మీద కలుపుతూ ఉడికించాలి.
మిశ్రమం ఉడికి గరిటెతోపాటూ వచ్చేస్తున్నట్టు ముద్దగా ఒక దగ్గరికి చేరుతున్నప్పుడు మంట కట్టేసి, ఒక పళ్ళానికి నెయ్యిరాసి మిశ్రమాన్ని అందులోకి తీసి సమంగా పరవాలి.
తరువాత మరొక బాణలిలో ఒక కప్పు పంచదార, నీళ్ళు పోసి తీగపాకం వచ్చాక మామిడి గుజ్జు వేసి సన్నని మంటమీద కలుపుతూ ఉడికించాలి.
మిశ్రమం బాగా దగ్గరపడి జిగటగా అయ్యాక పళ్ళెంలోని జీడిపప్పు మిశ్రమంపై వేసి సమానంగా పరచి డైఫ్రూట్స్ వేసి, చల్లారాక ముక్కలుగా కోసుకోవాలి.
No comments:
Post a Comment