ఖర్జూర రసగుల్లా |
ఖర్జూర పండ్లు - 10 బ్రెడ్ పీసెస్ - 10 బాదంపప్పు - 10 పంచదార పాకం - ఒక కప్పు పాలు - 2 టేబుల్ స్పూన్లు యాలకులు చెర్రీస్ - తగినన్ని
ముందుగా ఖర్జూర పండ్లలో విత్తనాలు తీసేసి ఆ స్థానంలో బాదంపప్పులు పెట్టాలి.
తర్వాత బ్రెడ్ అంచులు కత్తిరించి, వాటిని పాలల్లో అద్ది, ఒక్కో బ్రెడ్ ముక్క మధ్యన ఒక్కో ఖర్జూర పండు ఉంచి, వాటిని ఉండలా చుట్టి పక్కన పెట్టుకోవాలి.
తరువాత ఒక గిన్నెలో పంచదార పాకం పోసి, అందులో యాలకుల పొడి వేసి బాగా కలపాలి. తర్వాత బ్రెడ్ రోల్స్‌ను ఈ పాకంలో వేసి తీయాలి. ఇలా తయారైన డేట్ రోల్స్‌పైన చెర్రీస్ అమర్చి సర్వ్ చేయాలి. అంతే డేట్ రసగుల్లా రెడీ.
No comments:
Post a Comment