పెసరపప్పు: అరకప్పు సగ్గుబియ్యం: పావుకప్పు బెల్లం తురుము: అరకప్పు కొబ్బరి తురుము: కప్పు జీడిపప్పు: కొద్దిగా యాలకులపొడి: పావుటీస్పూను నెయ్యి: 2 టేబుల్‌స్పూన్లు
కొబ్బరితురుములో అరకప్పు నీళ్లు పోసి మెత్తగా రుబ్బి పాలు తీయాలి. తరవాత మళ్లీ మరో అరకప్పు నీళ్లు పోసి రుబ్బి రెండోసారి కూడా పాలు తీసి పక్కన ఉంచాలి.
పెసరపప్పు శుభ్రంగా కడిగి అందులో రెండోసారి తీసిన కొబ్బరిపాలు పోసి మెత్తగా ఉడికించి మెదపాలి.
ఇప్పుడు ఉడికించిన పెసరపప్పులో బెల్లం తురుము వేసి కరిగించాలి.
విడిగా మరో గిన్నెలో మొదటిసారి తీసిన కొబ్బరిపాలు పోసి అందులోనే సగ్గుబియ్యం వేసి ఉడికించాలి.
ఇప్పుడు దీన్ని పెసరపప్పు మిశ్రమంలో పోసి కలపాలి. చివరగా నేతిలో వేయించిన జీడిపప్పు, యాలకుల పొడి, మిగిలిన నెయ్యి కూడా వేసి కలిపి అందించాలి.
No comments:
Post a Comment