రసగుల్లా |
పాలు - అరలీటరు మైదాపిండి - రెండు టీ స్పూన్లు నిమ్మరసం - పావు టీ స్పూను (అరకప్పు నీటిలో కలపాలి) పంచదార - 100 గ్రాములు నీళ్లు - 1 లీటరు యాలకుల పొడి - అర టీ స్పూను.
పాలను కాచాక నిమ్మరసం వేయండి. మెల్లగా పాలు విరిగి పైనంతా పెరుగులా పేరుకుంటుంది. నీరులేకుండా వడకట్టి, విరిగిన ఆ పాలగడ్డలను చల్లటి నీటితో కడిగి మెత్తగా ముద్దలా చేసుకోవాలి.
తర్వాత మైదాని కూడా కలిపి సమాన భాగాలుగా ఉండల్లా తయారుచేసుకొని పక్కనుంచుకోవాలి.
. లేత పంచదార పాకం పట్టుకుని అది పొయ్యిమీద ఉండగానే అందులో ఉండల్ని వేసి 15 నిమిషాల పాటు ఉడికించాలి.
ఉండలు ఉడికి ఉబ్బిన తరువాత దించేసి యాలకులపొడి చల్లాలి. రసగుల్లాలను చల్లారనిచ్చి రిఫ్రిజిరేటర్‌లో పెట్టి చల్లచల్లగా తింటే ఎంతో రుచిగా ఉంటాయి.
No comments:
Post a Comment